Esha Deol: సూర్య హీరోయిన్ విడాకులు.. 12 ఏళ్ల కాపురానికి స్వస్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Esha Deol: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హేమామాలిని కూతురు, నటి ఈషా డియోల్ అభిమానులకు చేదువార్త చెప్పింది. తన భర్త భరత్ తక్తానీతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తుతున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఆమె ఈ విషయాన్నీ కన్ఫర్మ్ చేసింది. తామిద్దరం 12 ఏళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నామని, పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, పిల్లలు మాత్రం తమకు చాలా ఇంపార్టెంట్ అని తెలిపింది. దీంతో ఆమె అభిమానులు షాక్ కు గురవుతున్నారు. ఈషా డియోల్.. బాలీవుడ్ స్టార్ కపుల్ ధర్మేంద్ర- హేమామాలిని పెద్ద కూతురు. తల్లి అడుగుజాడల్లోనే ఈ చిన్నది 21 ఏళ్ళ వయస్సులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అన్ని భాషల్లో 30 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది.
ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ సినిమాలో సూర్య సరసన నటించి మెప్పించింది. ఈ సినిమా తరువాత ఆమెకు తెలుగు, తమిళ్ అభిమానులు పెరిగిపోయారు అని చెప్పొచ్చు. అనంతరం 2012లో భరత్ తక్తానీని పెళ్లి చేసుకుని ఓ మూడేళ్లు నటనకు బ్రేక్ ఇచ్చింది. వీరికి ఇద్దరు పిల్లలు. పిల్లలు పుట్టాకా వారిని పెంచడంతో ఆ సమయం గడిచిపోయింది. ఇక డిజిటల్ ఓటిటీ లు రావడంతో ఈషా కూడా ఓటిటీలో రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. ఇక గత కొన్నేళ్లుగా భరత్ – ఈషా మధ్య పడడం లేదని, ఇరు కుటుంబాల పెద్దలు రాజీ కుదర్చాలని చూసినా కూడా వర్క్ అవుట్ కాకపోవడంతో విడాకులు తీసుకొని విడిపోయినట్లు తెలుస్తోంది.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!