Rachitha Mahalakshmi: ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళందరూ హీరోహీరోయిన్లు కావాలనే వస్తారు. కానీ, ఆ అవకాశం ఎప్పుడు వస్తుంది అనేది చెప్పడం కష్టం. ఇక ఆ స్థాయి వరకు వెళాళ్లి అంటే ఇండస్ట్రీలోనే ఉండాలి. అందుకే చాలామంది ముందు చిన్న చిన్న పాత్రలు అయినా చేటు ఉంటారు.. ఇంకొంతమంది సీరియల్స్ లో మెప్పిస్తూ ఉంటారు. అలా సీరియల్స్ తో మెప్పించి స్టార్స్ అయిన వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి కోలీవుడ్ నటి రచిత మహాలక్ష్మీ చేరింది. సీరియల్ హీరోయిన్ గా ఆమె ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఆమె చేసిన స్వాతి చినుకులు సీరియల్ పెద్ద సక్సెస్ ను అందుకుంది. అందులో నీలగా ఆమె పాత్ర అద్భుతమని చెప్పాలి. ఈ సీరియల్ తరువా రచిత తెలుగులో ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్యనే ఆమె తమిళ్ సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ వస్తుంది.
ఇక తాజాగా రచిత హీరోయిన్ గా మారింది. రాజవేల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎక్స్ ట్రీమ్. తాజాగా ఈ చిత్రం లాంఛనంగా చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రారంభమైంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో రచిత పోలీసాఫీసర్ గా కనిపించనుంది. ఈ సినిమా పోస్టర్ లో అయిలీ సిరీస్ తో బాగా పేరు తెచ్చుకున్న అభి నక్షత్ర ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రచిత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.