అరుణ్ విజయ్ హీరోగా, హరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘యానై’. దీనిని తెలుగులో ‘ఏనుగు’ పేరుతో డబ్ చేశారు. ఆదివారం సాయంత్రమే హైదరాబాద్ లో ఈ సినిమా తెలుగు వర్షన్ ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రచారం ఇలా మొదలు పెట్టారో లేదో అలా విడుదల వాయిదా పడిపోయింది.
కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా విజయపథంలో సాగుతుండటంతో ‘ఏనుగు’ సినిమాను రెండు వారాలు వెనక్కి పంపారు నిర్మాత. తాజాగా కమల్ హాసన్ ను చిత్ర దర్శక నిర్మాతలు, హీరో అరుణ్ విజయ్ కలిసి అభినందించారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, తమ చిత్రం ‘యానై’ను జూలై 1న విడుదల చేయబోతున్నట్టు తెలి