Ee Nagaraniki Emaindi Re-release: తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా ఐదేళ్ల క్రితం విడుదలై మంచి విజయం సాధించడంతో ఈ రీ రిలీజ్ సీజన్లో మరోసారి రిలీజ్ చేశారు. 2018 జూన్ 29న విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో అప్పట్లో యూత్‍ను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికీ సినిమా చాలా మందికి హాట్ ఫేవరెట్. అయితే, ఈ నగరానికి ఏమైంది మూవీ అప్పట్లో విజయం సాధించినా అప్పట్లో చాలా మంది థియేటర్లలో చూడలేకపోయారు, అయితే, రిలీజై ఐదేళ్ల పూర్తయిన సందర్భంగా ఇప్పుడు మళ్లీ థియేటర్లలోకి ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని సిటీల్లో టికెట్ బుకింగ్స్ జోరుగా సాగడంతో ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టిచింది.
Dil Raju Son : దిల్ రాజు కొడుకు ఎలా ఉన్నాడో చూశారా?…. మొదటి సారిగా ఫొటో లీక్!
తొలి సారి విడుదల అయిన టైమ్ లో రెండు రాష్ట్రాలు కలిసి ఓపెనింగ్ ఎంత వచ్చిందో, దానికి డబుల్ పైనే నైజాంలో రెండో సారి ఓపెనింగ్ వచ్చిందని అంటుంన్నారు. అంతేకాక అప్పట్లో మార్నింగ్ షోలకి 20 లక్షలు వస్తే ఇప్పుడు ఏకంగా 80 లక్షలు వచ్చాయని అంటున్నారు. ఈ క్రమంలో ఈ నగరానికి ఏమైంది సినిమా రీ-రిలీజ్‍లో కలెక్షన్లు రికార్డులు బద్దలు కొట్టే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ సహా కొన్ని నగరాల్లో ఈ మూవీకి క్రేజ్ విపరీతంగా కనిపిస్తుందని అంటున్నారు. ఇక ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో విశ్వక్‍సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించగా అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి కీలక పాత్రలు పోషించారు. తరుణ్ భాస్కర్ డైరెక్షన్, డైలాగ్స్.. ఈ నగరానికి ఏమైంది సినిమాకు ప్రధాన బలంగా నిలవడంతో యిప్త్ దృష్టిలో న్యూఏజ్ సినిమాల్లో ఓ క్లాసిక్‍గా ఇది నిలిచిపోయింది.