Eagle: ఏంటీ.. కామెడీనా.. ట్రైలర్ చూసి సీరియస్ అనుకున్నామే.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eagle: మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రవితేజ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. రవితేజ లాంగ్ హెయిర్, గడ్డంతో.. లుంగీ తో ఉండడంతో మాస్ లుక్ లో కనిపించాడు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూ లు ఇస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. ఇక తాజాగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఒక ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తి విషయాలను పంచుకున్నాడు.
“సినిమా కథను ట్రైలర్‌లో చూపించాం. అప్పటినుంచి ఈగల్ సీరియస్ సినిమా అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఈగల్‌లో రవితేజ సార్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు. కానీ మరో మార్గంలో వినోదం ఉంటుంది. ఫైనల్‌గా ఈగల్ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఎలాంటి విసుగు తెప్పించే ఎలిమెంట్స్ ఉండవు.. జోనర్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాను చూస్తారు. చాలా గ్యాప్ తరువాత రవితేజ వయసుకు తగ్గ పాత్రను చేస్తున్నాడు. మేకప్ లేకుండా రవితేజ ఈ సినిమాలో నటించాడు. విభిన్నమైన పాత్రలో ఆయనను చూస్తారని” చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు.. ఏంటీ.. కామెడీనా.. ట్రైలర్ చూసి సీరియస్ అనుకున్నామే.. ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Also Read
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
- Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
తాజావార్తలు
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!