Project K: ప్రభాస్ సినిమాలో దుల్కర్ సల్మాన్ స్పెషల్ రోల్? పోస్టర్ లో అతనేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మహానటి’ సినిమాతో టాలెటెండ్ యంగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్… పాన్ ఇండియా స్టార్ అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్‌తో ‘ప్రాజెక్ట్ కె’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తుండగా… అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12 రిలీజ్ చేయబోతున్నారు. మహాశివరాత్రి పండగ రోజున రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. అందులో జస్ట్ ఒక హ్యాండ్‌ని మాత్రమే చూపించారు. అది కూడా భారీ యుద్ధాన్ని తలపించేలా ఉండడంతో నాగ్ అశ్విన్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడనిపిస్తోంది. గతంలోనూ ప్రాజెక్ట్ K నుంచి ‘హ్యాండ్’ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేశారు. దాంతో ప్రాజెక్ట్ కె కథకి హ్యాండ్‌తో ఉన్న సంబంధం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కె నుంచి వచ్చిన పోస్టర్ వైరల్ అవ్వడంతో, ప్రభాస్ ఫాన్స్ ఆ పోస్టర్ ని డికోడ్ చేసే పనిలో పడ్డారు. పోస్టర్ లో గన్స్ పట్టుకోని నిలబడిన ముగ్గురిలో ఒకరు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అయ్యి ఉంటాడు అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ‘సీతారామం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు దుల్కర్. ప్రాజెక్ట్ కె పోస్టర్ చూసిన తర్వాత ఈ హై టెక్నికల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమాలో దుల్కర్ కూడా ఉండే ఛాన్స్ ఉందని సాలిడ్ బజ్ వినిపిస్తోంది. సీతారామం ప్రమోషన్లో భాగంగా.. ప్రాజెక్ట్ కె పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు దుల్కర్. ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ కెలో ఉన్నాడనే టాక్ ఊపందుకుంది. కాబట్టి ఇందులో నిజం లేదని చెప్పడం కష్టమే. ఒకవేళ దుల్కర్.. ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటే మాత్రం అదిరిపోతుందనే చెప్పొచ్చు. ఏదేమైనా ప్రాజెక్ట్ కె పై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి.
Also Read
- Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
- Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని 'శ్రీ రామ్‌లీలా మహాసంఘ్' డిమాండ్
- Ramayana: 'రామాయణం' ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
- Dhanush - SK : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్‌డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!