Dulquer salmaan: రొమాంటిక్ హీరో అనే పదం విసుగు తెప్పించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dulquer salmaan:దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా అశ్వినీదత్ నిర్మించిన ‘సీతారామం’ చిత్రం ఆగస్ట్ 5న విడుదల కాబోతోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో మృణాల్ ఠాకూర్ కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇతర ప్రధాన పాత్రలను ఇందులో సుమంత్, రశ్మిక మండన్న, భూమికా చావ్లా, ప్రకాశ్ రాజ్, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్ తదితరులు పోషించారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఇందులో దుల్కర్, హను రాఘవపూడి, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన, సుమంత్, రమేష్ ప్రసాద్, నిర్మాత అశ్వినీదత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ, ”అందరూ రొమాంటిక్ హీరో అని పిలవడంతో విసుగొచ్చి ఇంక ప్రేమకథలు చేయకూడదని అనుకున్నాను. ఇలాంటి సమయంలో హను ఈ కథతో వచ్చారు. అద్భుతమైన ప్రేమ కథ. చిరకాలం గుర్తుండి పోయే ఎపిక్ మూవీ. ఇలాంటి కథని ఎట్టి పరిస్థితిలో వదులకూడదనిపించింది. చివరి ప్రేమకథగా ‘సీతారామం’ లాంటి క్లాసిక్ ఎపిక్ లవ్ స్టొరీ చేయాలని నిర్ణయించుకున్నా. ఈ మూవీ షూటింగ్ అద్భుతమైన అనుభవం. దేశంలోని అనేక ప్రదేశాలలో షూట్ చేశాం. అందులో చాలా ప్రదేశాలు నేను ఎప్పుడూ చూడలేదు. కథని బలంగా నమ్మాం. అందరం వంద శాతం బెస్ట్ ఇచ్చాం. అశ్వినీదత్ గారి లాంటి సినిమాపై ప్యాషన్ వున్న నిర్మాతతో ఇప్పటివరకూ పని చేయలేదు. అన్ని సదుపాయాలూ సమకూర్చారు. హను సినిమాపై గ్రేట్ పేషన్ వున్న రచయిత, దర్శకుడు. ఆయనకి సినిమా తప్పితే మరో ద్యాస లేదు. ‘సీతారామం’ లార్జర్ దెన్ లైఫ్ సినిమా” అని అన్నారు. హను రాఘవపూడి మాట్లాడుతూ, ”ఈ సినిమా బాగా వర్షం వచ్చినపుడు వేడి కాఫీ తాగినట్లు వుంటుంది. ఎండాకాలంలో చల్లటి నీరు తాగినట్లు వుంటుంది. ఈ సినిమా చూస్తున్నపుడు మిమ్మల్ని మీరు మర్చిపోతారు. ఇది రాసివ్వగలను. ఈ సినిమా మీతో పాటు వచ్చేస్తుంది” అని చెప్పారు.
Also Read
- NTR - Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
- Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న 'ఇడుపు కాయితం'.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
- Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
- Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన తొలి తెలుగు సినిమా అనుభవాలను చెబుతూ, ”దర్శకుడు హను జీనియస్. ఈ కథని చెప్పినపుడు సీత, రామ్ ప్రేమలో పడిపోయాను. నిర్మాత అశ్వినీదత్ గారు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. సెట్ లో ప్రతిరోజు ఒక అందమైన కలలా వుండేది. సీత పాత్ర అద్భుతంగా వుంటుంది. ఆ పాత్రలో రొమాన్స్ కూడా వుంది. ఈ మధ్య కాలంలో రొమాంటిక్ సినిమాలు తగ్గిపోతున్నాయి. ‘సీతారామం’ మ్యాజికల్ రొమాంటిక్ మూవీ అనుకోవచ్చు” అని అన్నారు. స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న మాట్లాడుతూ, ”ఒక అందమైన ప్రేమ కథ చెప్పాడానికి కథకుడు వుండాలి. కథ ఎలా జరిగిందో వివరంగా చెప్పాలి. ఇందులో నాది అదే పాత్ర” అని తెలిపింది.
రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ, ”మా నాన్నగారు మూకీ నుండి సినిమాల్లో భాగమయ్యారు. ప్రసాద్స్ అనేది సినిమా కోసం ఏర్పడిన సంస్థ. సినిమా కరోనాతో గడ్డుకాలం ఎదుర్కొంది. అయితే గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు ప్రేక్షకుల ప్రేమతో కష్టకాలాన్ని అధిగమించింది. త్వరలో జనం ముందుకు రాబోతున్న ‘సీతారామం’ యూనిట్ కి ఆల్ ది బెస్ట్” అని అన్నారు. కరోనా ఉదృతంగా ఉన్న సమయంలో కాశ్మీర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రష్యా లాంటి ప్రదేశాల్లో సాహసించి షూటింగ్ చేశామని, దీనిని చూసి ఎంజాయ్ చేసి సూపర్ సక్సెస్ ని ఇస్తారనే నమ్మకం ఉందని నిర్మాత అశ్వినీదత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా ఓ దృశ్య కావ్యం లాంటిదని సుమంత్ చెప్పారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!