బోల్డ్ కంటెంట్ తో ‘దొరకునా ఇటువంటి సేవ’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సందీప్ పగడాల, నవ్య రాజ్ జంటగా రామచంద్ర రాగిపిండి దర్శకత్వంలో దేవ్ మహేశ్వరం నిర్మిస్తున్న సినిమా ‘దొరకునా ఇటువంటి సేవ’. ఏ డేంజరస్ ఫ్యామిలీ గేమ్… అనేది ఉప శీర్షిక. వెంకీ దడ్‌బజన్, టి.ఎన్.ఆర్, రవివర్మ, అపూర్వ, నక్షత్ర, బేబీ వీక్ష, మాస్టర్ రిత్విక్ రెడ్డి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ గురించి దర్శకుడు రామచంద్ర మాట్లాడుతూ, ”ఒక మంచి విషయం చెబుతూ మంచి సినిమా తీయడం చాలా సులభం. సమాజంలో జరిగే చెడు విషయాలను ప్రశ్నిస్తూ, మంచి సినిమా తీయడం చాలా కష్టం. ప్రస్తుతం సమాజంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో జరిగే నేరాలు విపరీతంగా పెరిగాయి. ప్రతి పదిమందిలో ఏడుగురు అక్రమ సంబంధాలు ఇష్టపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. క్షణికానందం కోసం ఎవరైనా అడ్డొస్తే చంపేస్తున్నారు.
Read Also : “లైగర్” దూకుడు… అప్డేట్స్ కోసం మేకర్స్ సన్నాహాలు
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
ఈ నేపథ్యంలో కథతో ప్రేక్షకులకు నచ్చే విధంగా ‘ఈ రోజుల్లో, బస్ స్టాప్, గుంటూరు టాకీస్, ఆర్ఎక్స్ 100’ సినిమాల తరహాలో వాటికి భిన్నమైన కంటెంట్‌తో ‘దొరకునా ఇటువంటి సేవ’ మూవీని తెరకెక్కించాను” అని అన్నారు. నిర్మాత దేవ్ మహేశ్వరం మాట్లాడుతూ, ”ఎవరూ ధైర్యం చేయలేని కొత్త కథాంశాలను బోల్డ్‌గా, బ్యాలెన్స్డ్‌గా తెరకెక్కించినప్పుడు ఆ సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయని ఎన్నో చిత్రాలు నిరూపించాయి. ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నప్పుడు పెద్ద సినిమాల మధ్య వచ్చినా విజయం అందిస్తారని డిసెంబర్ 10న మా సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నాం” అని అన్నారు. స్క్రీన్ మ్యాక్స్ పిక్చర్స్ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతోంది.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?