“లైగర్” దూకుడు… అప్డేట్స్ కోసం మేకర్స్ సన్నాహాలు

రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా చిత్రం “లైగర్” పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో మైక్ టైసన్, అనన్య పాండే కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత రెండు వారాలుగా యూఎస్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా యూఎస్‌లోని లాస్ వెగాస్‌లో తాజా షెడ్యూల్‌ను ముగించిందని అనన్య ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనున్న బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌తో తారాగణం అక్కడ షూట్ చేసింది.

Read Also : ‘అఖండ’ ఈవెంట్ కి గెస్ట్ గా బన్నీ.. తెర వెనుక ఉన్నది ఎవరు..?

సినిమాలో కొంత భాగాన్ని చిత్రీకరించడానికి టీమ్ ఈ నెల ప్రారంభంలో లాస్ వెగాస్ వెళ్లింది. నవంబర్ 25 గురువారం, ‘లైగర్’ తారాగణం లాస్ వెగాస్ షూట్ షెడ్యూల్‌ను ముగించిందని అనన్య ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చింది. మైక్ టైసన్‌కి సంబంధించిన సన్నివేశాలు ఫైట్, మాంటేజ్ సాంగ్‌తో పాటు ఇక్కడ చిత్రీకరించారని సమాచారం. ఇక చివరి దశకు చేరుకోవడంతో సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయి. త్వరలోనే విజయ్ అభిమానులను ఉత్సాహరిచే అప్డేట్స్ రానున్నాయి. వరుసగా అప్డేట్స్ ఇవ్వడానికి మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

“లైగర్” ఈ ఏడాది సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే క‌రోనా వైర‌స్ ప్ర‌భావం వ‌ల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించారు మేక‌ర్స్. ఈ మూవీతో అనన్య పాండే తెలుగు సినిమాల్లోకి అడుగు పెడుతోంది. ఈ చిత్రానికి ఛార్మి కౌర్, కరణ్ జోహార్, పూరీ జగన్నాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

"లైగర్" దూకుడు… అప్డేట్స్ కోసం మేకర్స్ సన్నాహాలు

Related Articles

Latest Articles