యాంకర్ అనసూయ పేరుకు ఎంత క్రేజ్ ఉందో చూస్తూనే ఉన్నాం.. ఇప్పుడు కేవలం సినిమాలను మాత్రమే చేస్తూ బిజీగా ఉంది.. ఈ మధ్యకాలంలో అనసూయ నటించిన సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో డిమాండ్ ను పెంచుకుంది.. భారీగానే రెమ్యూనరేషన్ ను కూడా తీసుకుంటుంది.. అయితే ఆమె చేసే ప్రతి పనికి భర్త సపోర్ట్ ఉంటుందని చాలా సందర్భాల్లో అనసూయ చెప్పుకొచ్చింది.. తాజాగా ఓ వార్త వినిపిస్తుంది..
అను భర్త శశాంక్ కు అను అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఏది కావాలన్న అడక్కుండానే ఇస్తాడు.. అలాంటి భర్త అను వద్దన్నా కూడా ఓ పని చేస్తాడట.. డానికి అను వద్దని వారించిన తన మాటను నెగ్గించుకుంటాడట.. తాజాగా ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.. అదేంటంటే..శశాంక్ భరద్వాజ్ అనసూయ ఎంత వద్దన్నా వినకుండా ఆమెకు ఇష్టమైన ఫుడ్ ని వండి చాలా ప్రేమగా తినిపిస్తారట.. ఆ ఫుడ్ తింటే నేను లావెక్కుతాను అని చెప్పినా కూడా ఏం కాదు నువ్వు బొద్దుగా ఉన్న బానే ఉంటావు అని బలవంతంగా తినిపిస్తాడట.. కొన్నిసార్లు కోపడ్డా కూడా ఆ పని చెయ్యకుండా ఉండడు అని అని చెప్తుంది..
ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే తెలుగులో రంగమార్తండా సినిమాలో నటించి మంచి మార్కులు వేయించుకుంది.. ఇప్పుడు అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప2 లో కీలక పాత్రలో కనిపించునుంది.. అంతేకాదు వేరే భాషల్లో కూడా సినిమాలు చేస్తూ వస్తుంది..