Doctor Babu Nirupam Sent a TV to his lady fan to Watch Karthika Deepam: స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ కి ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాక్టర్ బాబు అనే పాత్రలో నిరుపమ్, వంటలక్క అనే పాత్రలో ప్రేమి విశ్వనాధ్ నటించిన ఈ సీరియల్ కొన్నేళ్ల పాటు టీవీ సీరియల్ టిఆర్పి రేటింగ్స్ లో టాప్ లో నిలిచింది. ఇక ఈ సీరియల్ కి సంబంధించిన సెకండ్ సీజన్ అంటే ఒక రకంగా సీక్వెల్ అనే చెప్పొచ్చు . కార్తీకదీపం నవవసంతం పేరుతో మార్చి 25వ తేదీ నుంచి ప్రసారం కాబోతోంది. స్టార్ మా ఛానల్ లో ప్రసారం కాబోతున్న ఈ సీరియల్ కి సంబంధించి ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నేరుగా ప్రేక్షకుల కోసం ప్రివ్యూ వేయడమే కాదు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించింది సీరియల్ యూనిట్.
Jyothika: నీ భర్తను ఒకరోజు నాకు అప్పుగా ఇస్తావా.. జ్యోతిక రిప్లై అదుర్స్
ఈ సందర్భంగా ప్రేక్షకులలో ఒకరు 2020వ సంవత్సరంలో తమకు ఒక టీవీ నిరుపమ్ పంపించినట్లు గుర్తు చేసుకున్నారు. కరోనా సమయంలో, ఐపీఎల్ జరుగుతున్న సమయంలో తమ ఇంట్లో ఒకటే టీవీ ఉండేదని తానేమో ఐపీఎల్ చూడాలంటే తల్లి మాత్రం కార్తీక దీపం సీరియల్ చూడడానికి ప్రయత్నించేదని ఈ విషయం మీద ట్వీట్ చేస్తే వెంటనే నిరుపమ్ ఒక కొత్త టీవీ పంపించే ప్రయత్నం చేసి వీలైనంత త్వరగా టీవీ పంపించారని చెప్పుకొచ్చారు. అందుకు ఆయన థాంక్స్ చెప్పాడు. అయితే దానికి నిరుపమ్, ఇప్పుడు అందరి ముందు చెప్పేశావు, అందరూ తలా ఒక టీవీ అడిగితే నేను తెచ్చివ్వలేను కదా అంటూ చమత్కరించారు.