Tillu Square: ‘టిల్లు స్క్వేర్’తో పాటు టిల్లు-3.. అనుపమని బోల్డ్ గా చూపించాలనే ఉద్దేశంతో లిల్లీ పాత్ర : డైరెక్టర్ ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tillu Square Director Mallik Ram Interview: ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల మీద సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ సినిమాను సమర్పిస్తోంది. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా దర్శకుడు మల్లిక్ రామ్ మీడియాతో ముచ్చటించి చిత్ర విశేషాలను పంచుకున్నారు.
టిల్లు స్క్వేర్ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు?
సిద్ధుతో నాకు ఎప్పటి నుంచో పరిచయం, దాదాపు ఇద్దరం ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టాం. మేమిద్దరం కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాం. నా మొదటి సినిమా నరుడా డోనరుడా, తర్వాత అద్భుతం అనే సినిమా చేశా. మధ్యలో పెళ్లి గోల అనే వెబ్ సిరీస్ కూడా చేశా అది చాలా పెద్ద హిట్ అయింది. డీజే టిల్లు, అద్భుతం సినిమాలు ఇంచుమించు ఒకే సమయంలో వచ్చాయి. ఆ తర్వాత నేను, సిద్ధు కలిసి ఒక సినిమా చేయాలనుకున్నాం. అదే సమయంలో నాగవంశీ ‘టిల్లు స్క్వేర్’ చేస్తే బాగుంటుందని చెప్పడం, డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ ఇతర కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటంతో నేను ఈ ప్రాజెక్టులోకి వచ్చా. ముందు కాస్త సంకోచించా కానీ కథ బాగా వచ్చేసరికి ఇక వెనకడుగు వేయలేదు.
Also Read
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్‌ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
డీజే టిల్లు వేరొకరు సృష్టించిన పాత్ర, దర్శకుడు కంటే హీరోకే ఎక్కువ పేరు వచ్చింది. మీరు సీక్వెల్ అంగీకరించే ముందు ఆ కోణంలో ఆలోచించారా?
అద్భుతం సినిమాకి కూడా కథ నాది కాదు. ప్రశాంత్ వర్మ ఇచ్చిన కథకు నేను దర్శకత్వం వహించా, నరుడా డోనరుడా కూడా రీమేక్, ఆ కథ బాగా నచ్చి చేశాను. నేను కథలు రాయగలను, ఇతరులు రాసిన కథలను తెరకెక్కించి వాటికి న్యాయం చేయగలను. అలాగే సిద్ధుకి పేరు వస్తుందంటే నాకు ఆనందమే. ఎందుకంటే నేను, సిద్ధు, ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా మేమంతా ఈ స్థాయికి రావడం కోసం దాదాపు 12 ఏళ్లుగా కష్టపడుతున్నాం. ఇప్పుడు కలిసి సినిమాలు చేస్తున్నాం కాబట్టి ఎవరికి క్రెడిట్ వచ్చినా సంతోషమే.
సినిమాలో సిద్ధు ప్రమేయం ఎంతవరకు ఉంటుంది?
బయట ఏవో కొన్ని వార్తలు వస్తున్నాయి కానీ వాటిలో వాస్తవం లేదు. సిద్ధు ఒక రచయితగా, నటుడిగా ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో.. అంత వరకే ఇన్వాల్వ్ అవుతాడు. దర్శకుడికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను ఇస్తాడు, ఎలా చేస్తే బాగుంటుందనేది చర్చించుకొని చేశాం. కథా చర్చల సమయంలో ఒక రచయితగా, షాట్ సమయంలో ఒక నటుడిగా ఏం చేయాలో అది చేస్తాడు. ఈ సినిమా కోసం సిద్ధుతో కలిసి రెండేళ్లు ట్రావెల్ చేశా. ఇద్దరం కలిసి సమన్వయంలో ఈ సినిమా చేశాం. డీజే టిల్లు నచ్చినవారిని టిల్లు స్క్వేర్ ఏ మాత్రం నిరాశపరచదు.
టిల్లు స్క్వేర్ ఎలా ఉండబోతుంది?
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ కి వ్యత్యాసం ఉంది. డీజే టిల్లు డెడ్ బాడీ నేపథ్యంలో సాగే బ్లాక్ కామెడీ. కానీ టిల్లు స్క్వేర్ అలా ఉండదు, ఒక కమర్షియల్ సినిమాలా ఉంటుంది. టిల్లు పాత్ర తీరు అలాగే ఉంటుంది. రాధిక పాత్ర ప్రస్తావన ఉంటుంది. మొదటి భాగాన్ని ముడిపెడుతూ కొన్ని సన్నివేశాలు ఉంటాయి. డీజే టిల్లుని గుర్తు చేస్తూనే టిల్లు స్క్వేర్ మీకొక కొత్త అనుభూతిని ఇస్తుంది.
అనుపమ ఎంపిక ఎలా జరిగింది?
అనుపమ గొప్ప నటి, ఈ సినిమాలో లిల్లీ పాత్ర ఛాలెంజింగ్ రోల్. ఆ పాత్ర కోసం ఎందరో పేర్లను పరిశీలించాం కానీ అనుపమ పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది. అనుపమని బోల్డ్ గా చూపించాలనే ఉద్దేశంతో లిల్లీ పాత్రను రాసు కోలేదు. లిల్లీ పాత్ర తీరే అలా ఉంటుంది. ఆ పాత్రకి ఆమె న్యాయం చేయగలరని నమ్మాము. ఆమె ఆ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేసింది.
టిల్లు-3 వచ్చే అవకాశముందా?
కొన్ని ఆలోచనలు ఉన్నాయి. భవిష్యత్తులో వచ్చే అవకాశముంది.
రీ షూట్ కి వెళ్ళడానికి కారణం ఏంటి?
ఇంటర్వెల్ తర్వాత ద్వితీయార్థం ప్రారంభ సన్నివేశాలు చాలా సినిమాల్లో తేలిపోతున్నాయి. ఫస్టాఫ్ బాగుంటుంది, క్లైమాక్స్ బాగుంటుంది కానీ ఆ 15-20 నిమిషాలు ఆశించిన స్థాయిలో ఉండదు. టిల్లు స్క్వేర్ విషయంలో అలా జరగకూడదని ఉద్దేశంతో.. ఆ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా రాసుకొని రీ షూట్ చేయడం జరిగింది.
విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ కదా.. ఏమైనా ఒత్తిడికి లోనయ్యారా?
ఒత్తిడి ఉండడం సహజం. కానీ కథ బాగా రాసుకోవడంతో.. చిత్రీకరణ సమయంలో పెద్దగా ఒత్తిడి అనిపించలేదు మొత్తం సినిమా చూసుకున్న తర్వాత ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుంది అనే నమ్మకం కలిగింది.
సంగీతం దర్శకులు మారడానికి కారణం?
ముందు నుంచి మేము డీజే టిల్లు టీంతోనే వెళ్ళాలి అనుకున్నాం. పాటలు రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల, నేపథ్య సంగీతం థమన్ అనుకున్నాం. రామ్ మిరియాల రెండు పాటలు ఇచ్చారు. శ్రీచరణ్ పాకాల ఒక పాట ఇచ్చారు ఆ పాట బాగా వచ్చింది. కానీ అక్కడ సిట్యుయేషన్ మారడంతో మరో సంగీత దర్శకుడు అచ్చుతో పాట చేయించడం జరిగింది. థమన్ ఇతర సినిమాలతో బిజీగా ఉండి అందుబాటులో లేకపోవడంతో భీమ్స్ గారిని తీసుకున్నాం.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్‌ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!