SS Rajamouli : రాజమౌళి ఇప్పుడు సినిమా తీస్తే బాక్సాఫీస్ రికార్డులన్నీ చెరిగిపోవాల్సిందే. ఒక్కో సినిమా వేల కోట్ల బిజినెస్ చేస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబుతో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. అయితే రాజమౌళిని అందరూ జక్కన్న అని పిలుస్తుంటారు. ఆయన వర్జినల్ పేరు అనుకుంటారు చాలా మంది దీన్ని. కానీ ఈ బిరుదును రాజమౌళికి ఓ నటుడు ఇచ్చాడు. అతను ఎవరో కాదు రాజీవ్ కనకాల. వీరిద్దరూ శాంతి నివాసం సీరియల్ తోనే పరిచయం అయ్యారు. అయితే స్టూడెంట్ నెంబర్ సినిమా చేస్తున్న టైమ్ లో.. రాజమౌళి ఒక్కొక్కరితో చాలా రకాల సీన్లు తీస్తున్నాడంట. రాజీవ్ తన సీన్ త్వరగానే అయిపోతుంది అనుకుంటే అర్ధరాత్రి 12.30 గంటల దాకా తీశాడంట రాజమౌళి.
Read Also : Kantara Chapter 1 : ఆ హీరో రికార్డును కాంతార1 బ్రేక్ చేయడం కష్టమే..
‘వామ్మో! పని రాక్షసుడు.. చెక్కుతున్నాడు సీన్లని జక్కనలా’ అని సరదాగా అనుకున్నాడు రాజీవ్. అది విన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా.. రాజమౌళిని జక్కన్న అని పిలవడం స్టార్ట్ చేసేశాడు. ఇంకేముంది అందరూ రాజమౌళిని జక్కన్న అని పిలవడం మొదలు పెట్టేసేసరికి.. రాను రాను అదే పేరు ఆయనకు కంటిన్యూ అయిపోయింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల స్వయంగా తెలిపాడు. రాజమౌళి అనే పేరు కంటే జక్కన్న అనే పేరే బాగా పాపులర్ అయిపోయింది. రాజమౌళి డైరెక్షన్ లో స్టూడెంట్ నెంబర్ వన్, విక్రమార్కుడు, సై, యమదొంగ, త్రిబుల్ ఆర్ సినిమాల్లో నటించాడు రాజీవ్ కనకాల. నేడు రాజమౌళి బర్త్ డే సందర్భంగా ఈ విషయం మరోసారి వైరల్ అవుతోంది.
Read Also : SS Rajamouli : ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ ను చూసి రాజమౌళి ఏం అనుకున్నాడో తెలుసా..?