Do You Know what is Corporate Bookings: తాజాగా ప్రభాస్ సలార్, షారుఖ్ డంకీ సినిమాల మధ్య హిందీ బెల్టులో తీవ్ర పోటీ నెలకొంది. ఒకానొక దశలో షారుఖ్ నేషనల్ థియేటర్ల చైన్ అధినేతలను కూడా ప్రలోభాలకు గురి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ సలార్ సినిమా పోటీ తట్టుకోలేక కలెక్షన్స్ చూపించుకోవడానికి కార్పొరేట్ బుకింగ్స్ చేయిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదే విషయం మీద యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ మేము ఇలా కార్పొరేట్ బుకింగ్స్ ఏమీ చేయలేదు, చేస్తే మేము కూడా 1000 కోట్లు కొల్లగొట్టేవాళ్ళం అని అన్నాడు. దీంతో అసలు ఈ కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏంటి? అనే చర్చ మొదలవుతోంది. మాకున్న పరిధి మేరకు ఆ అంశం మీద మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాం.
Devil: డెవిల్ రిలీజ్ కి ముందు నవీన్ మేడారం బహిరంగ లేఖ.. అదేదీ నిజం కాదంటూ!
ఆర్గానిక్ బుకింగ్ మరియు కార్పొరేట్ బుకింగ్ మధ్య తేడా ఏమిటి?
ఈ మధ్య నార్త్ లో పెద్ద సినిమా ఏది విడుదలైనా థియేటర్లు హౌస్‌ఫుల్‌గా ఉంటాయి. బుకింగ్స్ ఫుల్ ఉన్నా, చాలా సార్లు థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఎందుకంటే కొన్ని సార్లు టిక్కెట్లు మిగిలిపోయినప్పుడు, ఏదైనా ఒక కార్పొరేట్ బ్రాండ్ లేదా ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా పెద్దమొత్తంలో బుక్ చేయబడతాయి. దీనిని కార్పొరేట్ బుకింగ్ అంటారు. ఈ రకమైన బుకింగ్ అనేక నగరాల్లో ఏకకాలంలో, పెద్ద సంఖ్యలో కూడా జరుగుతుంది. ఇది కాకుండా, ఒక నగరానికి మాత్రమే పరిమితం చేయగల బ్లాక్ బుకింగ్ కూడా ఉంటుంది. తరచుగా అభిమాన సంఘాలు, కార్పొరేట్ కంపెనీల ఉద్యోగుల కోసం, అపార్ట్మెంట్ బిల్డింగ్స్ యాజమాన్యాలు కూడా ఇటువంటి బుకింగ్‌లు చేస్తాయి. అయితే వీరు ఇలా చేయడం వెనుక ఉండేది సినిమా ప్రొడక్షన్ హౌస్. అదేంటి ప్రొడక్షన్ హౌస్ ఇలా చేస్తే నష్టపోయే అవకాశం ఉంది అక్కడ అనుకుంటున్నారా. అయితే ఇక్కడే అసలు లాజిక్ దాగి ఉంది.
ఇలా చేయడం ప్రొడక్షన్ హౌస్ కు లాభదాయకంగా ఉందా లేదా నష్టాన్ని తెచ్చిపెడుతుందా అనేది అసలు అక్కడ వేరే ప్రశ్న. తరచుగా ప్రొడక్షన్ హౌస్‌లు ఏదైనా స్టార్ ఇమేజ్ బిల్డప్ కోసం ఇటువంటి వ్యూహాలను ప్రయత్నిస్తాయి. బ్రాండ్ వాల్యూ పెరిగే కొద్దీ సినిమాపై ప్రేక్షకుల్లో ఉత్సాహం కూడా పెరుగుతుంది. ఇక అలా హౌస్ ఫుల్స్ చూపిస్తూ ఉంటె థియేటర్‌లో ఫుట్‌ఫాల్ పెరిగే అవకాశం పెరుగుతుంది. అందుకే సినిమా కలెక్షన్స్ ని పెంచి మరీ టికెట్స్ బుక్ అయినట్టు చూపిస్తూ థియేటర్ ఖాళీగా ఉన్నా, టిక్కెట్లు కొని హౌస్‌ఫుల్‌గా ప్రకటిస్తారు. మనవైపు తక్కువ కానీ ఈ ట్రెండ్ బాలీవుడ్ లో ఎక్కువ ఉంది.