గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి అందరికీ తెలుసు.. త్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు.. ముఖ్యంగా జపాన్ ప్రజలకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం.. మరో సినిమా కావాలని వెయిట్ చేస్తున్నారు..పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన తారక్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు డైరెక్టర్స్ తో పాటుగా హీరోయిన్ లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు.. తాజాగా ఎన్టీఆర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
అదేంటంటే.. ఎన్టీఆర్ కు రామ్ పోతినేని బ్రదర్ అవుతాడని ఓ వార్త షికారు చేస్తుంది.. అవును నిజమా ఇన్ని రోజుల్లో ఎక్కడ చెప్పలేదు అనే సందేహం వస్తుంది కదూ.. మీరు విన్నది నిజమే.. తారక్ మరియు రామ్ బంధువులు. ఇదే విషయాన్ని రామ్ ఓ సందర్బంలో చెప్పాడు.. గతంలో ఓ వేదికపై రామ్ పోతినేని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నాకు వరసకు అన్నయ్య అవుతాడు అని తెలిపాడు.. అప్పట్లో ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.. అయితే వీరిద్దరు కలిసి ఎక్కడా కనిపించలేదు.. ప్రస్తుతం ఈ వార్త విన్న ఇద్దరి ఫ్యాన్స్ నెట్టింట చర్చలు జరుపుతున్నారు..
ఇక ఎన్టీఆర్ దేవర సినిమా అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. దాంతో పాటుగా బాలీవుడ్ బడా సినిమా వార్ 2 లో కూడా నటిస్తున్నాడు తారక్. ఈ మూవీలో హృతిక్ రోషన్ తో పాటు కలిసి నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. రామ్ విషయానీకొస్తే.. ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది..