Disco Dancer : ఇప్పుడంటే అన్నీ పాన్ ఇండియా సినిమాలే. ప్రతి సినిమాకు ఈజీగా వెయ్యి కోట్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడున్న రేట్లు, సినిమా ప్రేక్షకుల సంఖ్యను బట్టి అదేమంత పెద్ద విషయం కాదు. అయితే ఇండియాలో తొలిసారి వంద కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా.. బాహుబలి, దంగల్, రోబో అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఇవేవీ రాకముందే ఓ సినిమా వంద కోట్లు వసూలు చేసి అప్పట్లోనే ఇండియాను షేక్ చేసింది. ఆ సినిమా పేరు డిస్కో డ్యాన్సర్. బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి చేసిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
Read Also : Mahavatar Narsimha : ఓటీటీలోకి మహావతార్ నరసింహా.. ఎక్కడ, ఎప్పటి నుంచి..?
ఇందులో కిమ్ హీరోయిన్ గా నటించగా బబ్బర్ సభాష్ డైరెక్ట్ చేశారు. సీనియర్ హీరో రాజేష్ ఖనా ప్రత్యేక పాత్రను పోషించారు. 1982లో రిలీజ్ అయిన ఈ మూవీ యూత్ ను ఓ ఊపు ఊపేసింది. ఇందులో మిథున్ చక్రవర్తి డ్యాన్స్ కుర్రాళ్లను ఊపేసింది. అప్పట్లో ఐయామ్ ఏ డిస్కో డ్యాన్సర్ అంటూ మిథున్ చక్రవర్తి చేసిన డ్యాన్స్ కు అంతా ఫిదా అయిపోయారు. 1982లోనే ఈ సినిమాకు రూ.6 కోట్లు రాగా, రష్యాలో కూడా విడుదల చేశారు. రష్యాలో 60 మిలియన్ రూబిల్స్ ను వసూలు చేసింది. అప్పటి లెక్కల్లో రూపాయల ప్రకారం 60 మిలియన్ రూబిల్స్ అంటే రూ.95 కోట్లు. అంటే మొత్తంగా ఈ మూవీ రూ.101 కోట్లను వసూలు చేసిందన్నమాట.