Divya Sridhar: నా మాజీ భర్త ఎంతోమంది అమ్మాయిల్ని మోసం చేశాడు.. ఆ పైలట్ చావుకి కారణమయ్యాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divya Sridhar Reveals Secrets About Her Ex Husband Arnav: తమిళ ఇండస్ట్రీకి చెందిన మాజీ జంట అర్ణవ్, దివ్య శ్రీధర్‌ల వివాదం గుర్తుందా? దివ్య గర్భిణీగా ఉన్న సమయంలో.. తామిద్దరం విడిపోతున్నామని వాళ్లు ప్రకటించారు. అంతేకాదు.. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. దివ్యకు అంతకుముందే పెళ్లయ్యిందని, ఆ విషయాన్ని దాచి తనని మోసం చేసిందంటూ అర్ణవ్ ఆరోపిస్తే.. అతనికి మరో అమ్మాయితో సంబంధాలున్నాయంటూ దివ్య బాంబ్ పేల్చింది. తనని వేధింపులకు కూడా గురి చేస్తున్నాడంటూ కుండబద్దలు కొట్టింది. అంతేకాదు.. తనకు అర్ణవ్ నుంచి ప్రాణహాని కూడా ఉందంటూ కమిషనర్ కార్యాలయానికి ఎక్కింది. ఇలా ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటూ.. కొంతకాలం తమ వివాదాన్ని సాగదీశారు. ఆ తర్వాత ఈ గొడవ సైలెంట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి దివ్య శ్రీధర్ తన మాజీ భర్తపై సంచలన ఆరోపణలు చేసింది.
Kanti Velugu : రికార్డు దిశగా కంటివెలుగు.. 1.58 కోట్ల మందికి పైగా పరీక్షలు
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
ఇటీవలే ఓ పాపాయికి జన్మనిచ్చిన దివ్య శ్రీధర్.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన మాజీ భర్త అర్ణవ్ గురించి మాట్లాడుతూ.. ఓ పైలట్ చావుకు కారణమయ్యాడంటూ ఆరోపించింది. అర్ణవ్ తనని తాను గేగా ఓ పైలట్‌తో పరిచయం చేసుకున్నాడని, అతని వద్ద నుంచి భారీ డబ్బులు దోచుకొని మోసం చేశాడని తెలిపింది. ఆ బాధని దిగమింగుకోలేక.. ఆ పైలట్ ఆత్మహత్య చేసుకున్నాడని బాంబ్ పేల్చింది. ఎంతోమంది అమ్మాయిలను కూడా అర్ణవ్ మోసం చేశాడని, ఓ ట్రాన్స్‌జెండర్‌ని కూడా నట్టేట ముంచాడని పేర్కొంది. ఈ మేరకు ఆడియో క్లిప్స్‌తో పాటు అమ్మాయిలతో అర్ణవ్ చేసిన చాటింగ్ స్క్రీన్‌షాట్లను బయటపెట్టింది. ఓ ఆడియె క్లిప్‌లో ఒక ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ.. అర్ణవ్ తనని పదేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. తాము కొన్నాళ్లు సంతోషంగా గడిపామని.. ఆ తర్వాత మరో మహిళతో పరిచయం ఏర్పడటంతో అర్ణవ్ తనని వేధించడం మొదలుపెట్టాడని పేర్కొంది. అర్ణవ్ వేధింపుల్ని తాను 8 ఏళ్లు భరించానని, ఆ క్లిప్‌లో ట్రాన్స్‌జెండర్ చెప్పుకొచ్చింది. ఇలా క్లిప్స్, స్క్రీన్ షాట్స్‌ని దివ్య బయటపెట్టడంతో.. వీళ్ల టాపిక్ మరోసారి సంచలనంగా మారింది.
Ambati Rambabu: చంద్రబాబు ప్రవేశపెట్టింది మేనిఫెస్టో కాదు.. మోసఫెస్టో
కాగా.. దివ్య శ్రీధర్‌కు 2013లోనే ఓ వ్యక్తితో పెళ్లి అయ్యింది. వీరికి ఓ పాప కూడా పుట్టింది. అయితే.. మనస్పర్థల కారణంగా వాళ్లు విడిపోయారు. అనంతరం ఆమెకు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో.. సహనటుడు అర్ణవ్ పరిచయం అయ్యాడు. అది ప్రేమగా మారడంతో.. 2022 జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. అయితే.. అదే సమయంలో దివ్యకు అంతకుముందే పెళ్లై, ఓ కూతురు ఉందన్న సంగతి అర్ణవ్‌కు తెలిసింది. మరోవైపు.. అర్ణవ్ మరో నటి అన్షితతో ఎఫైర్ నడుపుతున్నాడని వ్యవహారం దివ్యకు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలై, తమ సీక్రెట్స్ బజారున పెట్టుకున్నారు.
తాజావార్తలు
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!