Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన దివ్వెల మాధురి రచ్చ మామూలుగా లేదు. వచ్చినప్పటి నుంచి అందరితో గొడవలు పడుతూనే ఉంది ఈమె. వస్తూనే దివ్యతో ఫుడ్ విషయంలో గొడవ పెట్టుకుంది. ఆ తర్వాత సంజనాతో గొడవ పడింది. అది సరిపోదు అన్నట్టు సింగర్ రాము రాథోడ్ తోనూ గొడవలు. వీరందరి విషయంలో మాధురి అరిచి గోల చేసి తన మాట నెగ్గించుకుంది. వాళ్లందరినీ సైలెంట్ చేసేసింది. ఈమెతో మనకెందుకులే అని వాళ్లంతా సైలెంట్ అయ్యారు. కానీ రీతూ చౌదరి దగ్గరకు వచ్చేసరికి నువ్వా నేనా అన్నట్టే గొడవ జరుగుతోంది. అందరితో గొడవ పెట్టుకున్నట్టే రీతూతో కూడా గొడవలు పెట్టుకుంది మాధురి.
Read Also : JR NTR : జూనియర్ ఎన్టీఆర్ పై శింబు షాకింగ్ కామెంట్స్
కానీ రీతూ మాత్రం అస్సలు వెనక్కు తగ్గట్టేదు. మాటకు మాట బదులిస్తూ మాధురిపై వరుసగా పంచులేస్తోంది. మాధురి ఎంత అరిచి గోల చేసినా సరే రీతూ టెంప్ట్ కాకుండా పాయింట్ మాట్లాడుతోంది. మాధురి కోపంలో ఏవేవో అనేస్తున్నా సరే రీతూ చౌదరి లాజిక్ మాట్లాడుతూ వరుసగా పంచులు వేస్తూ నోరు మూయిస్తోంది. వీళ్లిద్దరి గొడవ చూసిన ప్రేక్షకులు వారంతా రీతూ చౌదరి మంచి పని చేసిందని కామెంట్లు పెడుతున్నారు. ఇన్ని రోజులు హౌస్ లో రీతూ చౌదరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడపడంతో నెగెటివ్ అయింది. కానీ ఇప్పుడు మాధురికి ఇచ్చే పడేస్తుండటంతో ఆమెకు క్రేజ్ పెరిగింది. దెబ్బకు ఇన్ని రోజులు ఆమెపై ఉన్న నెగెటివిటీ పక్కకు పోయి ఆమెకు పాజిటివ్ గా పోస్టులు వస్తున్నాయి. అంటే దివ్వెల మాధురి వల్ల రీతూ చౌదరికి క్రేజ్ పెరుగుతోందన్నమాట.
Read Also : Kantara Chapter 1 : కాంతార-1 బీభత్సం.. ఇప్పటి దాకా ఎంత వసూలు చేసిందంటే..?