Kantara Chapter 1 : రిషబ్ శెట్టి హీరోగా స్వీయ డైరెక్షన్ లో వచ్చిన హై ఓల్టేజ్ మూవీ కాంతార చాప్టర్ 1. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా రికార్డులు తిరగరాస్తోంది. మొదటి పార్టు కేవలం రూ.20 కోట్లతో తెరకెక్కి ఏకంగా రూ.450 కోట్లు వసూలు చేసింది. రికార్డుల పరంగా దుమ్ములేపింది ఆ సినిమా. దానికి ప్రీక్వెల్ గా వచ్చిన కాంతార చాప్టర్ 1 అంచనాలకు తగ్గట్టే ఆకట్టుకుంది. ఇందులో రిషబ్ సరసన రుక్మిణీ వసంత్ నటించింది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా తెలుగు నాట మంచి విజయం అందుకుంది. రెండు వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.105 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు కన్నడ సినిమా తెలుగునాట ఎక్కువ వసూలు చేయడం అంటే కేజీఎఫ్ 2 తర్వాత ఇదే.
Read Also : Keerthi Suresh : కీర్తి సురేష్ పోస్టర్ చూశారా.. భలే ఇంట్రెస్టింగ్ గా ఉందే..
అటు హిందీలోనూ ఈ మూవీ రికార్డు నెలకొల్పింది. హిందీలో కాంతార చాప్టర్ 1 అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాల లిస్టులో చేరిపోయింది. ఈ సినిమా ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. చూస్తుంటే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసేలాగా కనిపిస్తోంది. ప్రస్తుతం దీపావళికి పెద్ద సినిమాలు లేకపోవడంతో ఆ వీకెండ్ కూడా కాంతారకు కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కాంతార చాప్టర్ 1 ఏకంగా రూ.717.50 కోట్లు కలెక్ట్ చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దెబ్బకు హోంబలే సంస్థకు భారీ లాభాలు వచ్చి పడ్డాయి. ఇప్పటి వరకు కాంతార చాప్టర్ 1 తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్లు రాబడుతోంది.
Read Also : Rekha Boj : కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్
A divine storm at the box office 💥💥#KantaraChapter1 roars past 717.50 CRORES+ GBOC worldwide in 2 weeks.
Celebrate Deepavali with #BlockbusterKantara running successfully in cinemas near you! ❤️🔥#KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere#Kantara… pic.twitter.com/rd92Dch1mS
— Hombale Films (@hombalefilms) October 17, 2025