Divi Vadthya: నటి దివి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం ఉన్నా కానీ, అమ్మడికి సరైన అవకాశాలు రాలేదని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ కు ఫ్రెండ్ గా, హీరోకు ఫ్రెండ్ గా నటించి మెప్పించిన దివి బిగ్ బాస్ కు వెళ్లి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ షో తరువాతనే దివి గురించి అందరికి తెల్సింది. ఇక బిగ్ బాస్ తరువాత దివి.. అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న దివి.. మొట్ట మొదటిసారి తన బ్రేకప్ స్టోరీని బయటపెట్టింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది.
” నేను బీటెక్ లో ఉన్నప్పుడే అతనిని కలిశాను. ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ఎంటెక్ వరకు రిలేషన్ లో ఉన్నాం. ఇరు కుటుంబాల పెద్దలను కూడా ఒప్పించాం. త్వరలో పెళ్లి ఉండబోతుంది అనుకొనేలోపు అతని తమ్ముడు అనారోగ్యం కారణంగా చనిపోయాడు. తమ్ముడు అంటే అతనికి చాలా ఇష్టం. నేను కూడా అతని తమ్ముడుతో ఎక్కువగా ఎటాచ్ మెంట్ పెట్టుకున్నాను. అతనితో పాటు అతని తమ్ముడు బాగోగులు అన్ని కలిసి చూసుకున్నాం. తమ్ముడు నా కళ్ల ముందే చనిపోయాడు. ఇక తమ్ముడి మరణం నుంచి నా ప్రియుడు, వారి కుటుంబం కోలుకోలేకపోయింది. కుటుంబంతో సహా.. వారు సొంత ఊరికి వెళ్ళిపోయాడు. నేను నా కెరీర్ ను వదిలేసుకొని వస్తానేమో అని అతను నాకు ఆ విషయాన్నీ చెప్పలేదు. అలా మేము విడిపోవాల్సివచ్చింది. ఒకవేళ అదే కారణం కనుక అప్పుడు చెప్పి ఉంటే.. నేను కూడా వారితోనే ఊరికి వెళ్ళిపోయి ఉండేదాన్ని” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దివి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.