Director Vassishta and his wife, Sujatha, were blessed with a baby girl: బింబిసార సినిమాతో డైరెక్టర్ గా మొదటి హిట్ అందుకున్నాడు వశిష్ట అలియాస్ వేణు మల్లిడి. అల్లు అర్జున్ తో బన్నీ, రవితేజతో భగీరథ, విష్ణు – శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఢీ లాంటి సినిమాలు నిర్మించిన మల్లిడి సత్యనారాయణ రెడ్డి కుమారుడు వేణు ముందుగా హీరోగా ప్రేమలేఖ రాశా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేశాడు కానీ నటుడిగా వర్కౌట్ కాకపోవడంతో సినీ పరిశ్రమకు దూరం అయిపోయాడు అనుకున్నారు. అయితే ఎట్టకేలకు దర్శకుడిగా ఆయన చేసిన బింబిసార సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక రకంగా దశ తిరిగి పోయినట్టుంది. ఆ తర్వాత ఆయన దర్శకుడుగా రెండో సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేసే అవకాశం దక్కించుకొని విశ్వంభర పేరుతో ఒక సోషియో ఫాంటసీ డ్రామా మూవీ చేస్తున్నాడు. ఒకరకంగా ఆయన లైఫ్ లో ఇది అతి పెద్ద ఎచీవ్మెంట్ గా భావిస్తున్నట్టు పలు ఇంటర్వ్యూలలో ఆయన చెప్పకు వచ్చాడు.
Cult Bomma: సాయి రాజేష్ డైరెక్షన్లో హిందీలో ‘కల్ట్ బొమ్మ’గా బేబీ.. కన్నేసిన స్టార్ కిడ్స్
అలాంటి వశిష్ట ఇంట్లో ఇప్పుడు ఆనంద హేల నెలకొంది. అసలు విషయం ఏమిటంటే వేణు భార్య సుజాత నిన్న సాయంత్రం అంటే సోమవారం సాయంత్రం ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వేణు అలియాస్ వశిష్ట దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఇక ఈ క్రమంలో వేణు కుటుంబ సభ్యులందరూ ఆనందంలో మునిగి పోయారు. బింబిసార సినిమా తర్వాత వేణు ఎలాంటి సినిమా చేస్తాడో అని అందరూ ఆలోచిస్తూన్న తరుణంలో బింబిసార 2 సినిమా కూడా చేయకుండా తప్పుకుని మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర అనౌన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక ప్రస్తుతానికి విశ్వంభర షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమా షూటింగ్లో ఉండగానే ఆయన భార్య పండంటి ఆడ బిడ్డకు జన్మనివ్వడం గమనార్హం.