Director Teja: టాలీవుడ్ దర్శకుడు తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా నిర్మొహమాటం లేకుండా ముఖం మీద చెప్పేస్తాడు. మొదటి నుంచి కూడా తేజ గురించి ఎంతోమంది.. ఎన్నోవిధాలుగా చెప్పుకొచ్చారు. అయినా వాటి గురించి ఎప్పుడు కూడా తేజ బాధపడలేదు. ఇక సినిమాల విషయంలోనే కాదు.. ప్రతి విషయంలో కూడా తేజ ఇలానే ఉంటాడు. తాజాగా తేజ.. ఓటు వేయనివారిని దేశ ద్రోహులు అని చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కాగా.. తేజ ఓటు హక్కును వినియోగించుకున్నాడు.
Nani: విజయ్- రష్మిక ప్రైవేట్ ఫొటోస్.. అందరి ముందు లీక్ చేసిన నాని.. ?
అనంతరం.. మీడియా ముందు ఆయన మాట్లాడుతూ.. “మాములుగా అందరు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు.. రోడ్లు బాలేవు, స్కూల్స్ బాలేవు, నీళ్లు సరిగ్గా రావడం లేదు. ఇలా ఫిర్యాదు చేసేవారందరూ బయటకు రావాలి. లేదంటే.. వాళ్లకు అడిగే హక్కు లేదు. నాకు తెలిసి ఓట్లు వేయని వారందరూ దేశ ద్రోహులు. ఆరోగ్యం బావున్నప్పుడు బయటకు వచ్చి ఓట్లు వేయాలి. పెద్ద పెద్దవాళ్లే వీల్ చైర్ లో వచ్చి ఓటు వేస్తున్నారు. వీళ్ళు వేయరు. జూబ్లీహిల్స్ లో కొంచెం తక్కువ ఉంటుంది ఓటింగ్. అంటే ఇక్కడ దేశద్రోహులు ఎక్కువ ఉన్నట్లు అర్ధం. ఇంట్లో కూర్చొని టీవీ లు చూస్తూ ఓటు వేయనివారందరు దేశద్రోహులే” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తేజ కెరీర్ విషయానికొస్తే.. ఈ మధ్య అహింస చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఎంతోమంది కొత్త నటీనటులను తెలుగుతెరకు పరిచయం చేసిన తేజ.. త్వరలో ఏమైనా కొత్త కథతో వస్తాడేమో చూడాలి.