Teja : డైరెక్టర్ బాలీవుడ్ ఎంట్రీ… లైన్ లో రెండు ప్రాజెక్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ఇండస్ట్రీలో ఉన్న ట్యాలెంటెడ్ నటీనటులు, డైరెక్టర్స్ ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా తమ సత్తా చాటుకోవాలని ఉత్సాహపడుతున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో, వంశీ పైడిపల్లి కోలీవుడ్ లో, అలాగే డైరెక్టర్ లింగుసామి తెలుగులో ఎంట్రీకి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి బాటలో పలువురు దర్శకులు నడుస్తున్నారు. అయితే తాజాగా యంగ్ అండ్ డైనమిక్ టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తేజ కూడా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు.
Read Also : Will Smith : చెంప దెబ్బ ఎఫెక్ట్ గట్టిగానే… హీరోపై అకాడమీ షాకింగ్ నిర్ణయం
Also Read
తెలుగు చిత్రసీమలో మంచి పాపులర్ అయిన తేజ ఇప్పుడు బాలీవుడ్లో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు తేజ ఇప్పటికే రెండు బాలీవుడ్ ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టినట్టు సమాచారం. వీటిని టైమ్ ఫిల్మ్స్ NH స్టూడియోస్ అండ్ ట్రిఫ్లిక్స్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించనుంది. తేజ సైన్ చేసిన రెండు ప్రాజెక్ట్‌లలో ఒకటి ‘జఖీమే’. ఇద్దరు బాలీవుడ్ తారలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం కాశ్మీర్‌లోని మంచు ప్రాంతంలో జరగనుంది. మరో ప్రాజెక్ట్ ‘తజ్కారి’ అనే వెబ్ సిరీస్. 1980 బ్యాక్‌డ్రాప్‌లో నాలుగు సీజన్ల సిరీస్ గా, ముంబైలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తారు. ఇక ప్రస్తుతం తేజ దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను టాలీవుడ్ కు పరిచయం చేసే పనిలో ఉన్నాడు. “అహింస” అనే టైటిల్ తో వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ దశలో ఉంది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్‌తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..