Karthika Deepam Idi Nava Vasantham Telugu Serial Pre Release Event news: తెలుగు బుల్లితెర సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ది ఒక ప్రత్యేకమైన అధ్యాయం. కొన్నేళ్ల క్రితం స్టార్ మా ఛానల్ లో మొదలైన ఈ సీరియల్ కొన్ని సంవత్సరాల పాటు విజయవంతంగా నడిచింది. డాక్టర్ బాబు అనే పాత్రలో నిరుపమ్, వంటలక్క అనే పాత్రలో ప్రేమీ విశ్వనాధ్, మోనిత అనే పాత్రలో శోభా శెట్టి ఇలా ఎవరికి వారు తమదైన శైలిలో సీరియల్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చారు. ఇక తెలుగు సీరియల్ అంటే కార్తీకదీపం, కార్తీకదీపం అంటేనే టాప్ తెలుగు సీరియల్ అనే విధంగా తెలుగు ఆడియన్స్ ఆ సీరియల్ కి అలవాటు పడ్డారు. చాలా కాలం పాటు సాగ దీసిన ఈ సీరియల్ ఎట్టకేలకు గత ఏడాది ముగింపుకి వచ్చేసింది. ఇక ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రకటన వచ్చింది.
Sree Vishnu: ‘ఓం భీమ్ బుష్’ పాయింట్ ని ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయలేదు: హీరో శ్రీవిష్ణు
అదేమిటంటే మరలా ఈ సీరియల్ సెకండ్ సీజన్ తీసుకొస్తున్నారు. నిజానికి తెలుగు సీరియల్స్ లో ఇలా సెకండ్ సీజన్ తీసుకురావడం అనేది చాలా అరుదు. ఏమైనా టాక్ షోస్ లేదా రియాలిటీ గేమ్ షోస్ కి సెకండ్ సీజన్ ప్లాన్ చేస్తారు కానీ ఆసక్తికరంగా ఈ సీరియల్ కి సెకండ్ సీజన్ ప్లాన్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. అంతేకాదు ఈ సీరియల్ కి ఒక సినిమా స్టైల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నారు యూనిట్. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఒకటిన్నర నుంచి ఈ సీరియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. డాక్టర్ బాబు వంటలక్క ఇద్దరు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సీరియల్ కి వచ్చిన సక్సెస్ తో దీనిని తమిళ సహా పలు ఇతర భాషల్లోకి కూడా రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతానికి తమిళ్ జీ ఛానల్లో తమిళ వెర్షన్ ప్రసారం అవుతుంది. ఇక ఇప్పుడు ఈ సీరియల్ రెండో సీజన్ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది అనే విషయం రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక రెండో సీజన్ కి కార్తీక దీపం నవ వసంతం అనే టైటిల్ ఫిక్స్ చేశారు.