‘కొత్త బంగారు లోకం’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న శ్రీకాంత్ అడ్డాల… ఆ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో’ సిరిమల్లె చెట్టు అంటూ మహేష్ బాబు, వెంకటేష్‌లతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేశాడు. ఆ తర్వాత మెగా హీరోని గ్రాండ్‌గా లాంచ్ చేశాడు. మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్‌ని ‘ముకుంద’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ చేశాడు శ్రీకాంత్ అడ్డాల. ముకుంద సినిమా మంచి కాంప్లిమెంట్స్ అందుకుంది కానీ సినిమా రిజల్ట్ కాస్త తేడా కొట్టింది. ఇక ఆ తర్వాత మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాలకి మరో ఛాన్స్ ఇచ్చాడు కానీ ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు. అప్పటివరకు సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరున్న దర్శకుడు కాస్తా బ్రహ్మోత్సవం నుంచి కోలుకోలేదు. అయితే చాలా గ్యాప్ తర్వాత వెంకటేష్‌తో కలిసి తమిళ్ ‘అసురన్’ మూవీని శ్రీకాంత్ అడ్డాల తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేశాడు కానీ ఈ సినిమా ఓటిటికే పరిమితమైంది. ఇక ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు శ్రీకాంత్ అడ్డాల.
నందమూరి బాలకృష్ణతో అఖండ సినిమాను నిర్మించిన ద్వారక క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాతో విరాట్ కర్ణ అనే మరో కొత్త హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాకు ‘పెద కాపు’ అనే టైటిల్.. ‘ఓ సామాన్యుడి సంతకం’ అనే ట్యాగ్ లైన్‌ను ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు శ్రీకాంత్ అడ్డాల. అందుకే టైటిల్‌లో ‘పెదకాపు 1’ పెట్టారు. ఫస్ట్ టైం ఈ సినిమాతో ఊరమాస్ టచ్ ఇవ్వబోతున్నాడు శ్రీకాంత్ అడ్డాల. అయితే ఈ సినిమా టైటిలే కాస్త రచ్చ లేపేలా ఉంది. ఈ టైటిల్ ఓ వర్గానికి చెందినదిగా ఉండడంతో కాంట్రవర్శీ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ స్టార్ట్ అయిపోయింది. మరి పెదకాపుతో శ్రీకాంత్ అడ్డాల ఏం చెబుతాడో చూడాలి.
ఓ సామాన్యుడి సంతకం ✍️💪
Here's the Title & 1st Look Poster of#PK1 – #PeddhaKapu1 , Introducing @ViratKarrna ✨
A #SrikanthAddala Film 🎬
Produced by @mravinderreddyyStay tuned for next BIG UPDATE 💥 pic.twitter.com/jdy9IjAKxr
— Dwaraka Creations (@dwarakacreation) June 2, 2023