SSMB 29: రాజమౌళి మహేశ్ సినిమా విషయంలో అది మాత్రం గ్యారెంటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి చేయనున్న ఈ సినిమాపై ఇప్పటికీ ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు మరింత పెరిగేలా మహేశ్ తో తాను ‘గ్లోబ్ ట్రాటింగ్’ సినిమా చేస్తున్నానని చెప్పాడు రాజమౌళి. ఇండియానా జోన్స్ స్టైల్ లో ఉండే సినిమాని ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నానని జక్కన చెప్పి, ఈసారీ తాను పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాను అనే హింట్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ క్యాంపెయిన్ లో భాగంగా అమెరికాలో బిజీగా ఉన్న రాజమౌళి ఇటివలే హైదరాబాద్ తిరిగొచ్చాడు. గ్రాండ్ గా జరిగిన ‘హిట్ 2’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన రాజమౌళి, రెండు నెలలుగా ఇంగ్లీష్ లో మాట్లాడి మాట్లాడి ఇప్పుడు తెలుగులో మాట్లాడుతుంటే హాయిగా ఉందని అందరినీ నవ్వించాడు.
ఇదే వేదికపై యాంకర్ సుమ, మహేశ్ బాబు సినిమా ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనే ప్రశ్నలు అడిగింది. ఈ క్వెషన్స్ వినగానే జక్కన్న నవ్వుతూ… “సినిమా ఎప్పుడు చేసినా ప్రీరిలీజ్ ఈవెంట్ కి మాత్రం సుమనే యాంకర్” అంటూ సమాధానం చెప్పాడు. దీంతో స్టేజ్ పైన ఉన్న వాళ్లందరూ ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ని చూసి ఎంజాయ్ చేశారు. ఇక మహేశ్ రాజమౌళి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయానికి వస్తే, #SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీ స్టార్ట్ అవ్వాలి అంటే ముందు మహేశ్ త్రివిక్రమ్ తో చేస్తున్న #SSMB28 సినిమా కంప్లీట్ అవ్వాలి. 2023 మార్చ్ లోపు #SSMB28 షూటింగ్ పార్ట్ ని మహేశ్ కంప్లీట్ చేసి, ఆ తర్వాత రాజమౌళి సినిమా కోసం రెడీ అవ్వాలి, ఈలోపు జక్కన #SSMB29 ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయాలి. దాదాపు ఈ సినిమా 2023 డిసెంబర్ వరకూ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపించట్లేదు. ఇక రిలీజ్ ఎప్పుడు అంటారా? ఆ ప్రశ్నకి సమాధానం రాజమౌళికి తెలిసే అవకాశం లేదు.
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!