డైరెక్టర్ కి బాలయ్య వార్నింగ్… 6 నెలలు ఆ హీరోను కలవొద్దు !

ప్రతిరోజూ బాలయ్య తాజా టాక్ షో “అన్‌స్టాపబుల్” ఎదో ఒక హాట్ టాపిక్ తో ట్రెండింగ్ లోన్ నిలుస్తోంది. అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో బాలయ్య హోస్ట్ గా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అయితే ఇప్పుడు బాలయ్య ఈ షోలో తన డైరెక్టర్ కు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మాస్ రాజా రవితేజ ఈ టాక్ షోలో పాల్గొన్న ఎపిసోడ్ లోనే దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఉన్నాడు. ఈ షోలో భాగంగా గోపిని, తాను రవితేజను క్రమం తప్పకుండా కలుస్తుంటానని, ఈ టాక్ షోకి రెండు రోజుల ముందు కూడా అతనిని కలిశానని చెప్పాడు.

Read Also : బ్రేకప్ టియర్స్ : లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న దీప్తి సునయన

దీనికి బాలయ్య, “మీ మునుపటి సినిమా హీరోని అలా ఎందుకు కలవాలనుకుంటున్నారు? మీ కాబోయే హీరోని కలవండి. మీరు మరో బ్లాక్ బస్టర్ అందించొచ్చు” అన్నారు. అయితే తాజాగా బాలయ్య, గోపీచంద్‌లు కలిసి ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత షోను ముగించే సమయంలో బాలయ్య సరదాగా మళ్లీ అదే టాపిక్‌ని మాట్లాడుతూ “వచ్చే ఆరు నెలలు రవితేజని కలవవద్దు… బదులుగా నన్ను కలవండి. మనం కలిసి బ్లాక్‌బస్టర్‌ అందించిన తర్వాతే మీరు అతన్ని కలవాలి” అంటూ బాలయ్య ఫన్నీగా స్వీట్ వార్నింగ్ ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి రవితేజ కూడా స్పందిస్తూ “సార్, మీరు గోపీని నా దగ్గరకు పంపకండి, నేను అతనిని కలవడానికి మీ సెట్స్‌కి వస్తాను” అని అన్నాడు. రవితేజ తనను ఎక్కడైనా కలవొచ్చని బాలయ్య పేర్కొన్నాడు.

Related Articles

Latest Articles