Little Hearts : 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న మౌళి తనూజ్.. హీరోగా చేసిన మొదటి మూవీ లిటిల్ హార్ట్స్. ఈ సినిమా చాలా చిన్న బడ్జెట్ తో వచ్చింది. పైగా మౌళికి హీరోగా మొదటి మూవీ. సెప్టెంబర్ 5న ఘాటీ, మదరాసి లాంటి బడా సినిమాలు ఉన్నాయి. అంత పెద్ద సినిమాలు ఉన్నాయని తెలిసినా సరే ఈ సినిమా యూనిట్ వెనకడుగు వేయలేదు. కంటెంట్ ను బలంగా నమ్మారేమో. అదే వాళ్లను నిలబెట్టింది. ప్రేక్షకులకు నచ్చాలంటే పెద్ద బడ్జెట్, పెద్ద యాక్షన్ సీన్లు, స్టార్ హీరో, హీరోయిన్లు అవసరం లేదని గతంలో చాలా మూవీలు నిరూపించాయి.
ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కూడా అలాంటి కోవలోకే వచ్చింది. సింపుల్ కథ, కథనం, ప్రేక్షకులను నవ్వించే సీన్లు ఇవే లిటిల్ హార్ట్స్ ను ప్రేక్షకులకు నచ్చేలా చేశాయి. అనుష్క లాంటి సీనియర్ హీరోయిన్, క్రిష్ లాంటి దర్శకుడి కాంబోలో భారీ బడ్జెట్ తో వచ్చిన ఘాటీ ఆడియెన్స్ కు యావరేజ్ గా అనిపించింది. మరి అంత పెద్ద బడ్జెట్, యాక్షన్ సీన్లు, హీరోలు దగ్గరుండి ప్రమోట్ చేశారు కదా.. మరి ఎందుకు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కారణం ఒక్కటే కంటెంట్, స్క్రీన్ ప్లే, డైలాగులు. ఇవి బాగుంటే చాలు ప్రేక్షకులకు అది పెద్ద సినిమానా, చిన్న సినిమానా, కొత్త హీరోనా అనేది పట్టించుకోరు. మదరాసి విషయంలోనూ ఇదే జరిగింది. రొటీన్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఆ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
Read Also : Little Hearts : థియేటర్ లోనే ఏడ్చేసిన మౌళి పేరెంట్స్
పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా.. పెద్ద స్టార్లు ఇందులో లేకపోయినా లిటిల్ హార్ట్స్ ప్రేక్షకుల హార్ట్స్ ను గెలుచుకుంది. కంటెంట్ బాగుంటు ఏ సినిమాను అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని గతంలో ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. అయినా సరే దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు మారట్లేదు. పెద్ద బడ్జెట్, భారీ యాక్షన్ సీన్ల కంటే.. ఆడియెన్స్ ను కట్టి పడేసే కథ, కథనం ఉండాలని మర్చిపోతున్నారు. ఇక్కడ లిటిల్ హార్ట్స్ కాన్ఫిడెన్స్ ను కూడా మెచ్చుకోవాలి. ఎంత నమ్మకం లేకపోతే పెద్ద సినిమాలతో ఒకే తేదీన పోటీ పడి రిలీజ్ చేస్తారు. ఎప్పటికైనా కంటెంట్ మాత్రమే అల్టిమేట్ అనే వాళ్ల నమ్మకం నిలబడింది.
Read Also : Ghaati : ఘాటీ సీన్లు.. ‘పుష్ప’ మూవీతో పోలుస్తున్న ప్రేక్షకులు..