Lavanya Tripathi: హీరోయిన్ లావణ్య త్రిపాఠి లక్కీ ఛాన్స్ పట్టేసింది. ఎట్టకేలకు తన ప్రేమను పెళ్లి పీటలు వరకు తెచ్చుకుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లావణ్య నిశ్చితార్థం మరికొద్దిసేపటిలో మొదలుకానుంది. మణికొండ లోని పామ్ బ్రీజ్ గెడెడ్ కమ్యూనిటీలోని నాగబాబు ఇంట ఈ వేడుక జరగుతుంది. మెగా ఫ్యామిలీ, అతికొద్దిమంది బంధువుల మధ్య ఈ నిశ్చితార్థం జరగనుంది. అయితే ఈ ఎంగేజ్ మెంట్ గురించి మెగా ఫ్యామిలీ కానీ, లావణ్య ఫ్యామిలీ కానీ బయటపడిందే లేదు. పీఆర్ టీమ్ ల ద్వారా ఇన్విటేషన్ బయటకు వచ్చిందే తప్ప మెగా కుటుంబం అధికారికంగా చెప్పింది లేదు. అసలు అది నిజమో కాదో అని అభిమానులు ఇంకా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎట్టకేలకు అది నిజమే అన్న కన్ఫర్మేషన్ వచ్చేసింది. పెళ్లికూతురు.. మెగా ఇంట అడుగుపెట్టింది.
OMG2: ఓ మై గాడ్.. శివతాండవం చేస్తున్న ఈ హీరోను గుర్తుపట్టారా..?
నిండైన చీరకట్టుతో.. తలనిండా మల్లెపూలతో అమ్మడు మెరిసిపోయింది. కారులో మెగా ఇంట అడుగుపెడుతున్న లావణ్య ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సాయంత్రం 7 గం.ల నుండి 8 గంటల మధ్య నిశ్చితార్థ అంగుళీక ధారణ కు దివ్య ముహూర్తాన్ని ఫిక్స్ చేశారట. ఈ ఎంగేజ్ మెంట్ కు మెగా ఫ్యామిలీ ఇప్పటికే వరుణ్ ఇంటికి చేరుకుంది. రామ్ చరణ్, అల్లు అర్జున్ అంజనాదేవి, అల్లు అరవింద్, సాయిధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్, ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా ఉపాసన సైతం ఎంగేజ్ మెంట్ కు హాజరయ్యింది. ఈ నిశ్చితార్థం అయ్యాకా వరుణ్- లావణ్య మీడియాకు ఫోటోలను రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక వరుణ్, లావణ్య క్లోజ్ ఫ్రెండ్ తప్ప బయటవారెవ్వరు కూడా లోపలి అనుమతి లేదని టాక్. ఇక వీరి ఎంగేజ్ మెంట్ ఫోటో ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.