Dil Raju: టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్ వాడివేడిగా జరిగిన విషయం తెల్సిందే. సి. కళ్యాణ్ ప్యానెల్ తో దిల్ రాజు ప్యానెల్ పోటీపడి ఎట్టేకలకు విజయాన్ని అందుకుంది. సి. కళ్యాణ్ ప్యానెల్ ను ఓడించి దిల్ రాజు ప్యానెల్ గెలుపు జెండా ఎగురవేసింది. ప్రొడ్యూసర్ సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానల్ గెలుపొందింది. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో రెండు ప్యానల్స్ నుంచి చెరో ఆరుగురు గెలుపును అందుకున్నారు. ఎగ్జిబిటర్స్ సెక్టార్‌లో ఏకగ్రీవంగా ఎన్నికైనవారు కూడా దిల్‌రాజుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
స్టూడియో సెక్టార్‌లో గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్ వారే కావడం విశేషం. నిర్మాతల విభాగంలో దిల్‌రాజు ప్యానెల్ నుంచి 12 మందిలో ఏడుగురు గెలుపొందారు. దిల్‌రాజు, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి, స్రవంతి రవికిశోర్, పద్మిని, రవిశంకర్ యలమంచిలి, మోహన్‌గౌడ్‌లు నిర్మాతల విభాగంలో దిల్‌రాజు ప్యానెల్ నుంచి గెలిచారు. దీంతో ఫిల్మ్ ఛాంబర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది.