సంక్రాంతి, దసరా లాంటి పండగ సీజన్స్ లో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పటి నుంచి ‘వారిసు/వారసుడు’ విడుదల వివాదాస్పదం అయ్యింది. డబ్బింగ్ సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఎలా ఇస్తారు అని చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. కొందరు బహిరంగంగానే ప్రెస్ మీట్స్ లో ‘వారిసు’ విడుదల గురించి మాట్లాడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ… సినిమాని ఎవరూ ఆపలేరంటూ దిల్ రాజుకి మద్దతుగా మాట్లాడాడు.
ఇక రీసెంట్ గా ఒక షోకి వెళ్లిన దిల్ రాజు ‘వారిసు’ విడుదల గురించి మాట్లాడుతూ… “మేము వారిసు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం అని మే నెలలో చెప్పాం, ‘వాల్తేరు వీరయ్య’ జనవరిలో రిలీజ్ అవుతుందని జూన్ లో చెప్పారు, ‘వీర సింహా రెడ్డి’ రిలీజ్ అనౌన్స్మెంట్ అక్టోబర్ లో వచ్చింది. నిజానికి బాలకృష్ణ సినిమా డిసెంబర్ లో విడుదల అవ్వాల్సి ఉంది, పోస్ట్ వర్క్స్ అవ్వకపోవడం వలనో లేక సంక్రాంతి అడ్వాంటేజ్ కోసమో డిసెంబర్ నుంచి చేంజ్ చేసి సంక్రాంతికి వస్తున్నారు అన్నారు. ఒకే బ్యానర్ నుంచి రెండు సినిమాలు రావడం అనేది 75 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఇదే మొదటిసారి. దాని గురించి ‘గిల్డ్’కి ఎలాంటి ఫిర్యాదు రాలేదు, వాళ్లని ఎవరూ ప్రశ్నించలేదు. ప్రొడ్యూసర్స్ కే లేని ఇబ్బంది వేరే వాళ్లకి ఎందుకు వచ్చింది?” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ ఇష్యూ ఏ బ్యానర్ నుంచి ఎన్ని సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయని కాదు తెలుగు స్టార్ హీరోల సినిమాలకి ఎన్ని థియేటర్స్ దొరుకుతాయి? డబ్బింగ్ సినిమాకి ఎన్ని థియేటర్స్ దొరకుతాయి అనేది? మరి ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే జనవరి వరకూ ఆగాల్సిందే. ఇప్పటికైతే సంక్రాంతి బరిలో ఉన్న మూడు సినిమాలు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాయి.