Dil Raju Father Passed Away: తెలుగు టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన వయసు ఇప్పుడు 86 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న ఆయన సోమవారం రాత్రి ఎనిమిది గంటలు దాటిన తరువాత తుది శ్వాస విడిచారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా పేరు పొందిన దిల్ రాజు పూర్తి పేరు వెంకటరమణారెడ్డి. చిన్నతనం నుంచే తన కుటుంబం అంతా రాజు అని పిలవడంతో ఆయనను అందరూ రాజు అనే పిలిచేవారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించిన ఆయన పైచదువుల కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు.
Leo Censor Report: 13 కట్లు.. ఆ కట్సే చెబుతున్నాయ్.. ఇక కాలర్లు ఎగరేయండి
ముందుగా పలు వ్యాపారాలు చేసిన ఆయన సినీ డిస్ట్రిబ్యూటర్ గా తొలి అడుగులు వేశారు. ఇక దిల్ సినిమాతో నిర్మాతగా మారి మంచి పేరు తెచ్చుకోవడంతో ఇక ఆయన పేరు దిల్ రాజుగా మారిపోయింది. దిల్ రాజు తండ్రి పేరు శ్యాంసుందర్ రెడ్డి కాగా తల్లి పేరు ప్రమీలమ్మ. దిల్ రాజుకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు, అందులో ఒకరు విజయ్ సింహారెడ్డి కాగా మరొకరు నరసింహారెడ్డి. ఇక దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత కాగా ఆమెతో హన్షిత అనే కుమార్తె కూడా జన్మించారు. అనిత ఆరోగ్యం సరిగా లేక మరణించడంతో 2020 వ సంవత్సరంలో తేజస్విని అనే అమ్మాయిని వివాహం చేసుకుని ఆమెకు వైఘా రెడ్డిగా నామకరణం చేశారు.