Leo Censor Certificate: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లియో సినిమా కోసం కేవలం తమిళ్ సినీ లవర్స్ మాత్రమే కాదు ఇండియా వైడ్ సినీ లవర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఎందుకో కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు ఆయన విక్రమ్ సినిమాతో మంచి జోష్ మీద ఉన్న లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో దాదాపుగా అందరి చూపు లియో సినిమా మీదనే ఉంది. ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా అంచనాలు కూడా గట్టిగానే పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయ్యాయి.
Kushitha Kallapu: బ్లాక్ డ్రెస్సులో బజ్జీల పాప అరాచకం.. పిక్స్ చూశారా?
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకోగా సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందని మేకర్స్ సుమారు నాలుగైదురోజుల క్రితం ప్రకటించారు. సెన్సార్ సభ్యులకు సినిమా యూనిట్ కి మధ్య కాస్త ఇబ్బందులు కూడా తెలెత్తాయి అని ప్రచారం కూడా జరిగింది. ఆ సంగతి ఎలా ఉన్నా తాజాగా ఈ సినిమాకి 13 కట్స్ చెప్పినట్టు సెన్సార్ సర్టిఫికెట్ తో క్లారిటీ వచ్చింది. ఎన్నోబూతులు తొలగించాలని సెన్సార్ సభ్యులు సూచనలు చేశారు. ఇక సెన్సార్ సూచనల మేరకు 47 సెకన్ల నిడివి తగ్గించినట్టు తెలిసింది. ఇక ఈ కటింగ్స్ చూస్తే ఇది ఒరిజినల్ లోకేష్ సినిమాలా ఉందని కాలర్లు ఎగరేయడానికి రెడీగా ఉండండని అంటున్నారు. లియో సినిమాలో విజయ్ కు ధీటుగా విలనిజాన్ని పండించడానికి స్టార్ హీరోలు ఇద్దర్ని దింపాడు లోకేష్. అర్జున్ సర్జా, అర్జున్ దాస్ లాంటి వారు కూడా సినిమాలో ఉండడంతో పాటు ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచడంతో ఈ సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు..