RRR : అలియాని మర్చిపోయారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR : బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మంగళవారం తన పుట్టినరోజును జరుపుకుంది. అభిమానుల నుంచి, సన్నిహితులు, సెలెబ్రిటీల నుండి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. ఇక అలియా పుట్టినరోజు సందర్భంగా ‘బ్రహ్మాస్త్ర’ నిర్మాతలు అలియా భట్ ఫస్ట్ లుక్ని రివీల్ చేస్తూ ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు అలియా అంటే ప్రేక్షకులకు RRR మాత్రమే గుర్తొస్తోంది. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీలో అలియా భట్ కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో RRR టీం నుంచి అలియా బర్త్ డే స్పెషల్ గా ఏదైనా ఉంటుందేమో అని ఆమె అభిమానులు భావించారు. కానీ వారికి నిరాశ తప్పలేదు. ఎందుకంటే స్పెషల్ ట్రీట్ ను పక్కన పెడితే… కనీసం అలియాకు బర్త్ డే విషెస్ కూడా చాలా లేట్ గా చెప్పింది RRR టీం. అయితే ‘బ్రహ్మాస్త్ర’ నిర్మాతలు విడుదల చేసిన అలియా భట్ లుక్ను దర్శకుడు రాజమౌళి ప్రశంసించారు. దీనికి అలియా భట్ కూడా కృతజ్ఞతలు తెలిపారు.
Read Also : The Kashmir Files : అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర… ప్రధాని సంచలన వ్యాఖ్యలు
Also Read
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
వాస్తవానికి RRR టీమ్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా తమ స్టార్స్, టెక్నీషియన్లకు రోజు మొదట్లోనే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. కానీ అలియా భట్ లాంటి బ్యూటీ పుట్టినరోజును మాత్రం దాదాపుగా పట్టించుకోలేదు. RRR మేకర్స్ ఈ సందర్భాన్ని సినిమా ప్రమోషన్ల కోసం ఎంతోకొంత ఉపయోగించుకోవచ్చు. కానీ వాళ్ళు అసలు అలియాను పట్టించుకోకుండా పూర్తిగా పక్కన పెట్టేశారు. కేవలం ఒక పిక్ తో ఆమెకు బర్త్ డే విషెస్ సరిపెట్టేశారు. మరోవైపు భారీ విడుదలకు సిద్ధమవుతున్నప్పటికీ RRR సెకండ్ రౌండ్ ప్రమోషన్లలో అలియా పెద్దగా కన్పించట్లేదు !
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!