Dhurandhar 2 : ‘దురంధర్’ వణుకు.. ఎవరిని చూసినా ఇండియన్ ఏజెంట్లే అనిపిస్తోంది.. అఫ్రిది సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని సినిమాలు కేవలం వసూళ్ల కోసమే వస్తాయి, కానీ మరికొన్ని సినిమాలు మాత్రం సరిహద్దులు దాటి అవతలి దేశాల వ్యవస్థలనే గడగడలాడిస్తాయి, ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘దురంధర్ 2’ (Dhurandhar 2: The Revenge) పాకిస్థాన్ పునాదులను కదిలించేస్తోంది. ఈ సినిమా దెబ్బకు అక్కడి ప్రముఖులు సైతం భయం భయంగా బతుకుతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్. పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం షాహిద్ అఫ్రిది తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌కు అద్దం పడుతున్నాయి. ‘దురంధర్ 2’ విడుదలైన తర్వాత పాకిస్థాన్‌లో ఒకరిపై ఒకరికి నమ్మకం పూర్తిగా పోయిందని ఆయన వాపోయారు. “ప్రస్తుతం పాకిస్థాన్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. నేను ఎవరితో మాట్లాడాలన్నా వంద సార్లు ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నా ముందున్న వ్యక్తి ఎప్పుడు ‘ఇండియన్ ఏజెంట్’గా మారిపోతాడో అన్న భయం వేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం రోడ్డు పక్కన ఉండే భిక్షగాడి నుండి ఎలైట్ క్లాస్ వరకు ప్రతి ఒక్కరినీ విచారించాలి. అసలు ఎవరు మనవాళ్లు.. ఎవరు భారత్ ఏజెంట్లు అనేది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.” అని షాహిద్ అఫ్రిది చెప్పుకొచ్చాడు.
Also Read:Rakasa: “సెకండాఫ్ అంతా వీఎఫ్ఎక్స్ మాయాజాలమే.. థియేటర్లో ‘రాకాస’ ఒక విజువల్ వండర్!”
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ఒకప్పుడు సరిహద్దుల్లో భారత సైన్యం ఇచ్చే దెబ్బకు పాకిస్థాన్ విలవిలలాడేది కానీ ఇప్పుడు ఒక సినిమాతో దర్శకుడు ఆదిత్య ధర్ ఆ దేశానికి నిద్ర లేకుండా చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘దురంధర్’ సినిమాలోని కంటెంట్ అక్కడి ఇంటెలిజెన్స్ వ్యవస్థను, ప్రజల ఆలోచనలను ఎంతలా ప్రభావితం చేసిందో అఫ్రిది మాటలే నిదర్శనం. ఒక ఫిక్షనల్ సినిమా ఇంతటి సంచలనం సృష్టించడం అరుదు. ప్రతి గల్లీలోనూ, ప్రతి ఇంట్లోనూ ఇండియన్ ఏజెంట్లు ఉన్నారనే భ్రమలోకి పాకిస్థానీయులు వెళ్లిపోయారంటే, ఆ సినిమాలో చూపించిన లాజిక్స్, స్క్రీన్ ప్లే ఎంత పక్కాగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ‘దురంధర్’ ఎఫెక్ట్ తో పాకిస్థాన్‌లో ఇప్పుడు “నమ్మకం” అనే పదమే కరువైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే, తుపాకీ గుండు చేయలేని పనిని ఆదిత్య ధర్ తన కెమెరాతో చేసి చూపించారని భారతీయులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!