Rakasa: “సెకండాఫ్ అంతా వీఎఫ్ఎక్స్ మాయాజాలమే.. థియేటర్లో ‘రాకాస’ ఒక విజువల్ వండర్!”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ చిత్ర విశేషాల్ని పంచుకునేందుకు దర్శకురాలు మానస శర్మ మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన సంగతులివే..
మీ నేపథ్యం గురించి చెప్పండి?
మానస శర్మ : మాది శ్రీకాకుళం. నేను మొదటగా యూట్యూబ్‌లో ‘మ్యాడ్ హౌస్’ చేశాను. ఆ తరువాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి క్రియేటర్, రైటర్‌గా పని చేశాను. ఆ తరువాత ‘బెంచ్ లైఫ్’ సిరీస్‌ని చేశాను. ఇది నాకు నాలుగో ప్రాజెక్ట్. ఫాంటసీ, అడ్వెంచర్లతో తీసిన ‘రాకాస’ చాలా కొత్తగా ఉండబోతుంది.
Also Read
- Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
- The Paradise OTT: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
- Nelson: ‘థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి’.. ‘జైలర్ 2’ రచ్చపై డైరెక్టర్ నెల్సన్ ఫస్ట్ రియాక్షన్!
- Varanasi: ‘వారణాసి’ పోస్ట్‌పోన్ కాలేదట.. ఆ రోజే థియేటర్లలోకి మహేష్ - జక్కన్న మూవీ!
‘రాకాస’లో ప్రధాన అంశం ఏంటి?
మానస శర్మ : ‘రాకాస’ని ఫాంటసీ, అడ్వెంచర్, కామెడీ జానర్లో తీశాం. ఇప్పటికే అందరూ మా టీజర్‌ని చూసి ఉంటారు. త్వరలోనే ట్రైలర్ రానుంది. అప్పుడు మా సినిమా గురించి ఇంకా చాలా క్లియర్‌గా తెలుస్తుంది. కామెడీని ప్రధాన అంశంగా, కొద్దిగా హారర్ ఎలిమెంట్స్‌తో పూర్తి ఫాంటసీ, అడ్వెంచర్‌గా ఈ మూవీని తీశాం.
*సంగీత్ శోభన్ ఈ కథలోకి ఎలా వచ్చారు?
మానస శర్మ : ‘రాకాస’ కథని ముందుగా నెట్ ఫ్లిక్స్‌లో సిరీస్ కోసం చెప్పాను. ఆ టైంలోనే ఈ కథను సంగీత్ విన్నారు. ఆయనకి కూడా కథ చాలా నచ్చింది. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి సంగీత్ వచ్చారు. సంగీత్ అద్భుతమైన నటుడు. మంచి వ్యక్తి. అతని కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం.
‘రాకాస’ చిత్రీకరణలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి?
మానస శర్మ : వెబ్ సిరీస్‌కి, సినిమాకి ఒకే రకమైన ఛాలెంజ్ ఉంటుంది. మేకింగ్ ఒకేలా ఉంటుంది.. రైటింగ్‌లోనే తేడా ఉంటుంది. షూటింగ్ పరంగా, చిత్రీకరణ సమయంలో ఎలాంటి తేడాలుండవు. ఈ సినిమా అవుట్ పుట్ నిహారికకి నచ్చాలని నేను మరింత బాధ్యతగా పని చేశాను. ఈ కథని పదిహేను నిమిషాలు నెరేట్ చేసిన తరువాత నిహారికకి చాలా కాన్పిడెంట్ వచ్చేసి ఓకే చెప్పారు.
నయన్ సారిక గురించి చెప్పండి?
మానస శర్మ : నయన్ సారిక మంచి నటి. డైరెక్టర్ ఏం చెబితే అది చేస్తారు. ఆల్రెడీ నేను ఇది వరకే ఆమెతో పని చేసి ఉన్నాను. ఆమె టాలెంట్, యాక్టింగ్ చూసే ఈ చిత్రంలోకి తీసుకున్నాం. ఆమె పాత్రని ప్రేక్షకులంతా ఇష్టపడతారు.
బడ్జెట్ పెరిగిందని అంటున్నారు? దాని గురించి చెప్పండి?
మానస శర్మ : ముందు నుంచీ మేం బడ్జెట్లోనే సినిమా తీయాలని అనుకున్నాం. అయితే ఏ మూవీకి అయినా సరే కొంచెం అటూ ఇటూగానే అవుతుంది. కానీ టీం అంతా ముందే అనుకుని ఉండటంతో చాలా వరకు లిమిట్‌లోనే ఉన్నాం.
‘రాకాస’లో కొత్తగా ఏం ఉండబోతోంది?
మానస శర్మ : ‘రాకాస’ థియేట్రికల్‌గా ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన చిత్రం. కథ పూర్తిగా ఫిక్షన్. అన్ని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఓ అందమైన చందమామ కథలా ఉంటుంది. విజువల్‌గా, సౌండింగ్ పరంగా ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది.
వీఎఫ్ఎక్స్ పనుల వల్ల సినిమా ఆలస్యం కాలేదా?
మానస శర్మ : ‘రాకాస’ సెకండాఫ్‌లో ఎక్కువగా వీఎఫ్ఎక్స్ ఉంటుంది. అందుకే మేం ముందుగా సెకండాఫ్ షూట్ చేశాం. ఒక పక్క వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతూ ఉంటే.. ఫస్ట్ హాఫ్‌ని షూట్ చేశాం. అలా మాకు టైం కలిసి వచ్చింది.
అనుదీప్ మ్యూజిక్ గురించి చెప్పండి?
మానస శర్మ : నిహారిక అనుదీప్ ని సజెస్ట్ చేశారు. అనుదీప్ మాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికే టీజర్‌కు ఆయన ఇచ్చిన ఆర్ఆర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన ఈ చిత్రానికి ప్రధాన బలం.
నిర్మాత నిహారిక గురించి చెప్పండి?
మానస శర్మ : నిహారికతో నాకు మంచి అనుబంధం ఉంది. పింక్ ఎలిఫెంట్‌లో ప్రాజెక్టులు ఎప్పుడూ ఆలస్యం అవ్వవు. అన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా జరిగిపోతోంటాయి. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ని తొమ్మిది నెలల్లో పూర్తి చేశాం. ‘కమిటీ కుర్రోళ్లు’ ఏడాదిన్నరలో రిలీజ్ అయింది. నిహారిక మంచి నిర్మాత. ఆమె అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తారు.
ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల గురించి చెప్పండి?
మానస శర్మ : ప్రస్తుతం కొన్ని కథలు, ఐడియాలు ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అందులో కామెడీ ప్రధానంగా,ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకుంటాను. ‘రాకాస’ తరువాత వాటి గురించి చెబుతాను.
తాజావార్తలు
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
-
Income Tax Jobs 2026: 10th, ఇంటర్ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు
-
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
-
TDP : గుంటూరు మేయర్ పీఠంపై టీడీపీ ఫోకస్.. బరిలోకి లక్ష్మీ అపర్ణ..
-
Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!