Dhruva Natchathiram Censored: ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ నటించిన ధృవ నచ్చతిరం సినిమా ఎట్టకేలకు విడుదల అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2016లో ఈ మూవీ షూటింగ్ మొదలుకాగా ఎన్నో కారణాలతో ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తయి చాలా కాలమే అయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా కాలం ఆగిపోయాయి, ఇక ఈమధ్య ఆ పనులు కూడా పూర్తి కావడంతో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిన క్రమంలో సెన్సార్ కు పంపగా యూఏ సర్టిఫికెట్ జారీ చేసినట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించారు.
Bobby Simha: లేపేస్తాం జాగ్రత్త .. ‘వాల్తేరు వీరయ్య’ నటుడికి బెదిరింపులు?
తెలుగులో ధృవ నక్షత్రంగా విడుదల కానున్న ఈ సినిమాను గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేశారు. స్పైథ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ ధృవ నచ్చతిరం మూవీలో రితూ వర్మ, సిమ్రన్, ఐశ్యర్య రాజేష్, రాధిక, జైలర్ వినాయకన్, అర్జున్ దాస్ కీలకపాత్రల్లో పోషిస్తున్నారు. ఇండియన్ స్పైగా విక్రమ్ నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ 2016లో మొదలుకాగా.. 2017లో విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ ఇన్నేళ్లు పట్టింది. ఈ సినిమా కోసం విక్రమ్ అభిమానులు ఏడేళ్లుగా ఎదురుచూస్తున్న క్రమంలో రిలీజ్ డేట్ రేపు ఉదయం అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ధృవ నచ్చతిరం సినిమా గురించి ఈ ఏడాది ప్రారంభంలో హింట్స్ ఇచ్చారు గౌతమ్ మీనన్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మళ్లీ మొదలుపెడుతున్నట్టు చెప్పడంతో ఈ సినిమా ఎప్పడు విడుదలవుతుందా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు.