Death Threats to Actor Bobby Simha: తెలుగువాడైనా ఎక్కువగా తమిళ సినిమాల్లో మెరిసిన బాబీ సింహ మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో విలన్ తమ్ముడిగా నటించి ఆకట్టుకున్నారు. తెలుగులో బాబీ సింహా ‘లవ్ ఫెల్యూర్’, ‘రన్’, ‘డిస్కో రాజా’, ‘ఏదైనా జరగొచ్చు’, ‘గల్లీ రౌడీ’, ‘అమ్ము’ వంటి చిత్రాల్లో నటించారు. విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకున్న ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన స్నేహితుల నుంచే హత్యా బెదిరింపులు రావడం చర్చనీయాంశం అయింది. తమిళ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన తమిళనాడు కొడైకెనాల్ లో సెటిల్ అయి ఓ ఇంటిని కూడా నిర్మించుకున్నారు. అయితే ఈ ఇంటి నిర్మాణం విషయంలోనే హత్యా బెదిరింపులు వస్తున్నట్టు వెల్లడించారు.
Jabardasth Avinash: హీరోగా మరో జబర్దస్త్ కమెడియన్.. డైరెక్టర్ ఎవరంటే?
బాబీ సింహా మాట్లాడుతూ కొడైకెనాల్ లో ఇల్లు నిర్మించాలని అనుకుని తమిళనాడులో పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న ఉసేన్, అతని స్నేహితుడైన బిల్డింగ్ కాంట్రాక్టర్ జమీర్ తో ఇంటి నిర్మాణ పనులకు ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. కోటీ 30 లక్షలతో నిర్మాణం కోసం అగ్రిమెంట్ చేసుకుంటే ఉసేన్, జమీర్ నా నుంచి రూ.40 లక్షల వరకు అదనంగా ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చారని అన్నారు. అలా ఇచ్చాక కూడా పనిపూర్తవ్వక పోవడంతో కొడైకెనాల్ పీఎస్ లో ఫిర్యాదు చేశానని, రాజకీయ నేపథ్యం ఉండటంతో పోలీసులూ చర్యలు తీసుకోలేదని అన్నారు. అందుకే కోర్టుకు వెళ్లామని దానికి వారు ఆగకుండా ‘సినిమాలో నువ్వు విలన్ కావొచ్చు.. మేం రియల్ విలన్స్’ అంటూ బెదిరిస్తున్నారని, ఓ ఎమ్మెల్యే అండతోనే ఇదంతగా జరుగుతుందని ఆరోపించారు. బాబీ సింహా విడుదలకి రెడీ అవుతున్న ‘రజాకార్’ అనే సినిమాలో కీలక పాత్ర పోషించారు.