ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ లిస్టు తీస్తే అందులో టాప్ 5 ప్లేస్ లో ఉండే హీరో ‘ధనుష్’. స్టార్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న ధనుష్ లాంగ్వేజస్ లో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు. హిందీ, తమిళ్, ఇంగ్లీష్ ఇలా ఏ భాషలో అయినా సినిమా చేసే ధనుష్ తన కెరీర్ లో మొదటిసారి తెలుగు-తమిళ భాషల్లో నటిస్తున్న బైలింగ్వల్ సినిమా ‘వాతి/సార్’. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సితార ఎంటర్తైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. విజయవాడ నేపధ్యంలో 1990ల ప్రాంతంలో జరిగిన కథగా ‘వాతి’ సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో ధనుష్ జూనియర్ లెక్చరర్ గా కనిపించనున్నాడు. సాంగ్స్ తో, టీజర్ తో ‘వాతి’ సినిమాపై అంచనాలు పెంచుతున్న చిత్ర యూనిట్ త్వరలో ట్రైలర్ ని కూడా రిలీజ్ చెయ్యనున్నారు.
Read Also: Dhanush 50: ఓ.. సార్.. కొద్దిగా గ్యాప్ ఇవ్వండి
ఫిబ్రవరి 17న ‘సార్’ సినిమా తెలుగులో రిలీజ్ అయ్యే టైంలో సమంతా నటించిన ‘శాకుంతలం’ సినిమా రిలీజ్ అవుతుంది. హిందీ నుంచి ‘షెహజాదా’ రంగంలోకి దిగుతుంది, ఈ మూవీ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఉండదు కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ మాస్ కా దాస్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా కూడా ఫిబ్రవరి 17నే ఆడియన్స్ ముందుకి రానుంది. గీత ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా ఫిబ్రవరి 17నే రిలీజ్ కానుంది. మరోవైపు మార్వెల్ నుంచి ‘యాంట్ మాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా’ సినిమా A సెంటర్స్ ని టార్గెట్ చేస్తూ ఫిబ్రవరి 17నే ప్రేక్షకుల ముందుకి రానుంది. తెలుగులో ‘సార్’ సినిమా హిట్ అవ్వాలి అంటే ఇన్ని సినిమాలని దాటి ప్రేక్షకులని మెప్పించాలి.
టాలీవుడ్ లో ధనుష్ సినిమా పరిస్థితి ఇలా ఉంటే కోలీవుడ్ లో మాత్రం ఇందుకు భిన్నంగా ధనుష్ మూవీకి, తన అన్న సెల్వ రాఘవన్ హీరోగా నటిస్తున్న సినిమానే పోటీగా రానుంది. డైరెక్టర్ నుంచి యాక్టర్ గా మారిన సెల్వ రాఘవన్ ప్రస్తుతం ‘బకాసురన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 17నే రిలీజ్ కానుంది. దీంతో ఒకే డేట్ ని అన్నదమ్ముల సినిమాలు ఆడియన్స్ ముందుకి వస్తున్నాయి. మరి సెల్వ రాఘవన్ తమ్ముడి కోసం వెనక్కి తగ్గి సోలో రిలీజ్ ఇస్తాడా లేక తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు పోటీకి దిగుతాడా అనేది చూడాలి.
Protect what's yours ! #BakasuranFromFeb17 pic.twitter.com/IjTF8LRJlB
— selvaraghavan (@selvaraghavan) January 29, 2023
Read Also: Dhanush Vs Viswaksen: ‘సార్’కు ‘ధమ్కీ’ ఇవ్వబోతున్న విశ్వక్ సేన్!