Dhanush Vs Viswaksen: ‘సార్’కు ‘ధమ్కీ’ ఇవ్వబోతున్న విశ్వక్ సేన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viswak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ ను అట్టహాసంగా నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఫలక్ నుమా దాస్’తో మాస్ ను అట్రాక్ట్ చేసిన విశ్వక్ సేన్, తాజా చిత్రం ‘ధమ్కీ’లోనూ అదే బాటలో సాగాడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపుదిద్దుకున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది. ఫిబ్రవరిలో ఈ మూవీని రిలీజ్ చేస్తామని ట్రైలర్ రిలీజ్ సమయంలో చెప్పారు.
తాజాగా ‘ధమ్కీ’ సినిమాను వచ్చే యేడాది ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా జనం ముందుకు తీసుకొస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. విశేషం ఏమంటే… ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. విశ్వక్ సేన్ ద్విపాత్రాభినయం చేసిన ‘ధమ్కీ’లో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. అయితే, ఈ సినిమా విడుదల రోజునే ధనుష్ బై లింగ్వల్ మూవీ ‘సార్’ కూడా రిలీజ్ కాబోతోంది. దీన్ని వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. అలానే గీతా ఆర్ట్స్ సంస్థ కిరణ్ అబ్బవరంతో నిర్మిస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ను కూడా ఫిబ్రవరి 17నే విడుదల చేయబోతున్నట్టు నిర్మాత బన్నీ వాసు ఇప్పటికే ప్రకటించారు. మరి ఈ ముక్కోణపు పోటీలో ఎవరిది పైచేయిగా నిలుస్తుందో చూడాలి.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..