Kubera: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని సినిమాలు.. ప్రయోగం అయినా.. రియల్ ఇన్సిడెంట్స్ అయినా.. పాత్ర ఏదైనా ధనుష్ దిగితే.. హిట్ గ్యారెంటీ. అలాంటి ధనుష్.. టాలీవుడ్ కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో జత కడితే.. అందులో కింగ్ నాగార్జున కూడా జాయిన్ అయితే.. మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ సంగీతం ఇస్తే.. ఇదిరా కాంబో అంటే.. ఇదిరా సినిమా అంటే అనక మానరు.ఇక ఈ చిత్రంలో ధనుష్ సరసన రష్మిక నటిస్తోంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను మొదలుపెట్టినప్పటి నుంచి అందరి మైండ్ లో రన్ అవుతున్న ప్రశ్న.. ధనుష్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు. శేఖర్ కమ్ముల సినిమాలు ఎలా ఉంటాయో అందరికి తెల్సిందే. అలాంటి డైరెక్టర్ ధనుష్ ను ఎలా చూపించబోతున్నాడు అని.. ఎట్టకేలకు ఈరోజుతో దానికి సమాధానం దొరికింది.
నేడు మహాశివరాత్రి సందర్భంగా DNS టైటిల్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కుబేర అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈటైటిల్ గ్లింప్స్ లో ధనుష్ ఒక బిచ్చగాడిగా కనిపించాడు. ఒక గోడపై శివునికి ఆహారం పెడుతున్న పార్వతి ఫోటోను చూపిస్తూ.. నడిరోడ్డుపై చిరిగిన బట్టలు, మాసిన గడ్డంతో ఒక బిచ్చగాడిలా ధనుష్ కనిపించాడు. ఇక పాత్రలు రావడమే ముఖ్యం.. ధనుష్ నటన ఎలా ఉంటుంది అనేది ఉహించనవసరం లేదు. ఇక గ్లింప్స్ కు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇంకా హైప్ ను తెచ్చింది. కుబేర అంటే.. అన్ని లోకాల్లో అత్యంత ధనవంతుడు. అలాంటి టైటిల్ కు, బిచ్చగాడిలా ఉన్న ధనుష్ కు ఏంటి సంబంధం అనేది సినిమా చూసే తెలుసుకోవాలి. ధనుష్ లుక్ చూసాక.. అభిమానులు చెప్తున్న ఒకే ఒక్క మాట మార్క్ మై వర్డ్స్.. ధనుష్ కెరీర్ లో మరో అవార్డు గ్యారెంటీ అని.. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.