కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘ఇడ్లీ కడై’. ధనుష్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ధనుష్ కెరీర్ లో వస్తున్న 52వ సినిమా అలాగే దర్శకుడిగా వస్తున్న నాలుగో సినిమా ఇదే. ఇటీవల బ్యాంకాక్ లో జరిగిన చివరి షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.
Also Read : Kollywood : వెయ్యి కోట్ల కలెక్ట్ చేసే అసలైన హీరో ఎవరు..?
రాయన్ సినిమా తరువాత ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో రాజ్ కిరణ్, అరుణ్ విజయ్ షాలిని పాండే, కీలక పాత్రలలో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రసన్న జీకె ఎడిటర్ గా వర్క్ చేస్తున్న ఈ సినిమాకు కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వండర్ బార్ ఫిలిమ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్ పై ధనుష్, ఆకాష్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమను ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలని భావించారు. కానీ షూటింగ్ డిలే కారణంగా విడుదల వాయిదా పడుతు వచ్చిన ఈ సినిమా మొత్తానికి షూటింగ్ ఫినిష్ చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది ఇడ్లీ కడై. చింతపల్లి రామారావు ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసి విడుదల చేయనున్నారు.