రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఓ హిట్ ఆల్బమ్ ఇస్తే అతడ్నే రిపీట్ చేస్తుంటారు హీరో అండ్ ఫిల్మ్ మేకర్స్. కానీ ధనుష్ మాత్రం 14 ఏళ్లుగా పక్కన పెట్టేశాడు. ఫస్ట్ టైం ఆర్య రీమేక్ కుట్టీ కోసం వర్క్ చేశారు ఈ ఇద్దరు. 2010లో వచ్చిన ఈ రీమేక్‌కు ఇంచుమించు ఆర్య సాంగ్స్, బీజీఎం ఇచ్చేయడంతో పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు దేవీకి. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుని ధనుష్ ఖాతాలో మంచి ఆల్బమ్‌గా మిగిలింది.
Also Read : Rajni : జైలర్ 2 తెలుగు రాష్ట్రాల రైట్స్.. అతిగా ఆశపడుతున్న మేకర్స్
ఇక ఇదే ఉత్సాహంతో నెక్ట్స్ వెంఘైకి ఛాన్స్ ఇచ్చాడు ధనుష్. సింగం ఫేమ్ హరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. రాజ్ కిరణ్, ప్రకాష్ రాజ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు. కానీ ఈ సినిమా పాటల పరంగా ఓకే కానీ సినిమా మాత్రం ఊహించనంత టాక్ తెచ్చుకోలేకపోయింది. ఆ టైమ్ లో ధనుష్ కు దేవి శ్రీ మధ్య ఎదో జరిగినట్టు గాసిప్స్ కూడా వినిపించాయి. కారణాలు ఏవైనా సరే అప్పటి నుండి ఇప్పటి వరకు ధనుష్ అండ్ రాక్ స్టార్ కలిసి వర్క్ చేయలేదు. 14 ఏళ్ళు అంటే రాముడు వనవాసం చేసినంత కాలం అయింది వీరి కాంబోలో సినిమా వచ్చి. కాగా మళ్ళి ఇన్నాళ్లకు ఈ ఇద్దరినీ కలిపాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ధనుష్- శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేరకి దేవీ శ్రీ మ్యూజిక్ ఇచ్చాడు. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. జూన్ 20న థియేటర్లలోకి రాబోతుంది కుబేర. 14 ఏళ్లు తర్వాత కొలబరేట్ అయిన ఈ కాంబో ఇప్పుడు ఎటువంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.