Danush : ధనుష్ – కలాం బయోపిక్‌పై ఓం రౌత్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మాజీ రాష్ట్రపతి, ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయే శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బయోపిక్కు దర్శకత్వం వహిస్తున్నది బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ ఓం రౌత్. ఆదిపురుష్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన, ఈసారి తన పూర్తి శ్రద్ధను కలాం బయోపిక్‌పై కేంద్రీకరించారు. ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఎంతగానో పెంచేలా ఓం రౌత్ తరచూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కలాం పాత్ర పోషిస్తున్న హీరో ధనుష్ గురించి విశేషంగా మాట్లాడారు.
Also Read : Jyothika : హీరోయిన్లకు గౌరవం లేదా..? సౌత్ ఇండస్ట్రీపై జ్యోతిక సంచలన ఆరోపణలు..
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
- Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
‘ధనుష్ ఒక అద్భుతమైన నటుడు. ఈ పాత్రకు ఆయన తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరు. ప్రతి సన్నివేశంలోనూ కలాం గారే కనిపిస్తారు. ఈ పాత్రను ఆయన ఒప్పుకోవడం నా అదృష్టం.ఈ సినిమా కేవలం ఒక బయోపిక్ మాత్రమే కాకుండా, అందులో కమర్షియల్ టచ్ కూడా ఉండేలా తీర్చిదిద్దుతున్నాం’ అని ఓం రౌత్ పేర్కొన్నారు. అంతే కాదు ఈ సినిమా కోసం ఓం రౌత్, కలాం గారి కుటుంబ సభ్యులను, ఆయన స్నేహితులను, ఆయనతో పనిచేసిన శాస్త్రవేత్తలను కూడా సంప్రదించారు. నిజ జీవితానికి దగ్గరగా, తప్పులు లేకుండా కథను తెరకెక్కించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. భూషణ్ కుమార్, అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్, కృష్ఖ్ కుమార్ లాంటి పెద్ద నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.కాగా ప్రస్తుతం ధనుష్ తనకు ఉన్న ఇతర కమిట్మెంట్స్ పూర్తి చేసుకున్నాక, ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ “కలాం : ది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా”గా ఫిక్స్ చేశారు. ఒకే భాషకు పరిమితం కాకుండా, పాన్ ఇండియా లెవెల్లో అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!