సౌత్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతిక, ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. భర్త సూర్యతో కలిసి ముంబైలో స్థిరపడిన జ్యోతిక, గత కొంతకాలంగా బాలీవుడ్ ఇతర భాషా చిత్రాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి, సోలోగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఈవెంట్‌లో జ్యోతిక చేసిన వ్యాఖ్యలు సౌత్ ఇండస్ట్రీ పై పెద్ద చర్చలు రేపాయి.
Also Read : Samantha : ఫిట్‌నెస్ మంత్రం.. వృద్ధాప్యాన్ని దూరం చేసే సమంత కొత్త వ్యాయామం..!
జ్యోతిక మాట్లాడుతూ.. ‘ సినిమా పోస్టర్లలో ఎక్కువగా హీరోలే హైలైట్ అవుతారు, హీరోయిన్లకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. నేను ఎన్నో సౌత్ హీరోలతో పని చేశాను, కానీ ఎవరూ నా పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. హిందీలో ‘శైతాన్’ సినిమా సమయంలో అజయ్ దేవగణ్ నా పోస్టర్‌ను షేర్ చేశారు. మలయాళంలో ‘కాథల్ ది కోర్’ కోసం మముట్టి కూడా ఇదే చేశారు. కానీ సౌత్‌లో ఇలాంటి వాతావరణం కనిపించదు” అని వ్యాఖ్యానించారు. జ్యోతిక చేసిన ఈ ఆరోపణలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
కొంతమంది ఆమెను తప్పుపడుతుండగా, మరికొందరు ఆమె మాటల్లో నిజముందని మద్దతు తెలుపుతున్నారు. ‘సినిమా విజయానికి హీరో ఎంత ముఖ్యమో, హీరోయిన్ కూడా అంతే ముఖ్యం. కనీసం ఒక పోస్టర్‌ను షేర్ చేయడానికి హీరోలకు టైం ఉండదా?’ అనే ప్రశ్నలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఇక జ్యోతిక వ్యాఖ్యలు ప్రత్యేకంగా టాలీవుడ్, కోలీవుడ్ పై వర్తిస్తాయని అనేక మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఆమె ఎక్కువ సినిమాలు చేసిన ఇండస్ట్రీలు ఇవే. ఇప్పుడు ఈ సంచలన ఆరోపణల పై సౌత్ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.