చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం విడాకుల పర్వం ఎక్కువైపోతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు విభేదాలతో విడిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో అక్కినేని నా చైతన్య- సమంత విడిపోవడం వారికి ఎంత బాధను ఇచ్చిందో తెలియదు కానీ వారి విడాకుల వార్త ఎంతోమంది అభిమానులను కలిచివేసింది. ఇక కోలీవుడ్ లో హీరో ధనుష్ – ఐశ్వర్య రజినీకాంత్ జంట విడాకుల వార్త కూడా అభిమానులను బాధపడేలా చేసింది. అయితే ఈ జంట ఎప్పటికైనా మళ్లీ కలుస్తారు అని అభిమానులు ఆశ పెట్టుకున్నారు. అయితే తాజాగా ఆ ఆశ నెరవేరబోతుందంట. ధనుష్ – ఐశ్వర్య తమ విడాకులు రద్దు చేసుకుంటారని కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య, హీరో ధనుష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
18 ఏళ్ళ దాంపత్య జీవితం అనంతరం ఈ జంట తాము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే అవి చిన్న చిన్నగొడవలేనని.. వీరిద్దరూ మళ్లీ కలుస్తారని, పెద్దలందరూ వారితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు ధనుష్ తండ్రి చెప్పుకొచ్చాడు. చెప్పినట్లుగానే రజినీ కాంత్, ధనుష్ పేరెంట్స్ అందరూ ఈ జంటను కూర్చోబెట్టి మాట్లాడారని, పిల్లల కోసమైనా ఇద్దరు కలిసి ఉండాలని చెప్పడంతో కన్విన్స్ అయ్యారని తెలుస్తోంది. త్వరలోనే వీరు అధికారికంగా ఆ విషయాన్నీ చెప్పనున్నారట. ఈ వార్త తెలియడంతో ధనుష్ అబిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న విభేదాలతో పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను దూరం చేయవద్దని, ధనుష్- ఐశ్వర్య మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.