Dhana Sri : ఇండియన్ క్రికెటర్ చాహల్, ధన శ్రీ విడాకులు దేశ వ్యాప్తంగా రచ్చ లేపాయి. విడాకుల టైమ్ లో చాహల్ నుంచి ధన శ్రీ రూ.60 కోట్ల భరణం తీసుకుందనే వార్తలు తీవ్ర దుమారం రేపాయి. వాటిపై అప్పట్లో పెద్ద రచ్చనే జరిగింది. కానీ వాటిపై ఆమె సైలెంట్ గా ఉండటం వల్ల మరింత ట్రోల్స్ వచ్చాయి. ఆమె భరణం నిజమే అంటూ మీడియా సంస్థల్లోనూ వార్తలు వచ్చాయి. వాటిపై రీసెంట్ గానే ఆమె స్పందించింది. చాహల్ నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిపింది. రూ.60 కోట్లు కాదు కదా.. ఒక్క రూపాయి అడగలేదని.. ఇద్దరం ఇష్టపూర్వకంగా విడిపోయినప్పుడు భరణం ఎలా అడుగుతానని తెలిపింది ధనశ్రీ.
Read Also : OG : ఇన్నాళ్లకు పవన్ ఫ్యాన్స్ కల తీర్చేసిన సుజీత్..
ఇక తాజాగా మరోసారి ఆమె స్పందించింది. రైజ్ అండ్ ఫాల్ రియాలిటీ షోలో పాల్గొన్న ఆమె.. చాహల్ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. చాహల్ ను పెళ్లి చేసుకుని తప్పు చేశా. పెళ్లి అయిన ఏడాది తర్వాత రెండు నెలలకే అతన్ని పట్టుకున్నా. అతను నన్ను మోసం చేశాడు అంటూ ఎమోషనల్ అయింది. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాహల్ నుంచి ధన శ్రీ విడిపోయిన టైమ్ లో ఆమె మీద వచ్చిన నెగెటివ్ ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం చాహల్ మళ్లీ క్రికెట్ లో ఫామ్ కోసం ట్రై చేస్తున్నాడు.
Read Also : Kantara 1 : రిషబ్ శెట్టిపై తెలుగు యువత ఆగ్రహం.. ఇంత చిన్న చూపా..?