KGF, కాంతార లాంటి పాన్ ఇండియా సినిమాలని ప్రొడ్యూస్ చేసిన హోంబెల్ ఫిల్మ్స్ భారి బడ్జట్ సినిమాలని ప్రొడ్యూస్ చెయ్యడమే కాదు ప్రజెంట్ చెయ్యడానికి కూడా ముందుకొస్తున్నారు. ఈ బడా బ్యానర్ ప్రెజెంట్ చేస్తున్న మూవీ ఫస్ట్ మూవీ ‘గురుదేవ్ హొయసాల’. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ జనరేషన్ లో చూసిన మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న యంగ్ విలన్ టర్న్డ్ హీరో ‘డాలి ధనంజయ’ నటిస్తున్న 25వ సినిమాగా తెరకెక్కిన ‘హొయసాల’ సినిమాని విజయ్ డైరెక్ట్ చేశాడు. పవర్ యాక్షన్ కాప్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ డేట్ లాక్ అవ్వడంతో మేకర్స్, ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచిన చిత్ర యూనిట్ తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
ఇందులో ‘గురుదేవ్ హొయసాల’ పాత్రలో గ్రే షెడ్ ఉన్న పోలిస్ పాత్రలో ధనంజయ ఇంటెన్స్ గా కనిపించాడు. కథని రివీల్ చెయ్యకుండా కేవలం క్యారెక్టర్ ఇంట్రో మాత్రమే చూపిస్తూ, యాక్షన్ ఎపిసోడ్స్ ని చూపిస్తూ కట్ చేసిన ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. టీజర్ కి ఇచ్చినట్లే అజ్నీష్ లోక్నాథ్ మరోసారి ట్రైలర్ కి కూడా సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. టీజర్ తో ఇంప్రెస్ చేసిన చిత్ర యూనిట్ ట్రైలర్ తో ‘గురుదేవ్ హొయసాల’ సినిమాపై అంచనాలని మరింత పెంచారు. అంచనాలు ఎక్కువగా ఉండడం, ప్రమోషనల్ కంటెంట్ కి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం, హోంబెల్ లాంటి డిస్ట్రిబ్యూటర్ అండ ఉండడం ‘గురుదేవ్ హొయసాల’ సినిమాకి మార్కెట్ పరంగా కలిసొచ్చే విషయాలు. అయితే ఈ సినిమా కారణంగా నాని ‘దసరా’ మూవీకి కష్టాలు వచ్చేలా ఉన్నాయి. హోంబెల్ మేకర్స్ ని కాదని దసరా సినిమాకి కర్ణాటకలో థియేటర్స్ లభిస్తాయా అంటే కష్టమనే సమాధానం చెప్పాలి. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ‘గురుదేవ్ హొయసాల’ సినిమా రిలీజ్ అవుతున్నట్లే, హిందీలో ‘భోలా’, తమిళ్ లో ‘పత్తు తల’ సినిమాలు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ ముందుకి రానున్నాయి. ఈ సినిమాల నుంచి ‘దసరా’ సినిమాకి గట్టి పోటీ ఎదురవ్వనుంది. మరి ఈ కాంపిటీషన్ ని తట్టుకోని కూడా నాని దసరా సినిమాతో సాలిడ్ హిట్ ఇస్తాడేమో చూడాలి.
𝐆𝐮𝐫𝐮𝐝𝐞𝐯 𝐇𝐨𝐲𝐬𝐚𝐥𝐚 𝐑𝐚𝐠𝐞 𝐁𝐞𝐠𝐢𝐧𝐬!💥#GurudevHoysala TRAILER OUT NOW
🔗 https://t.co/WG4kp8bSNtIn theatres on 30th March – #EeSalaHoysala#VijayKiragandur @KRG_Studios @amrutha_iyengar @vijaycinephilia @Karthik1423 @yogigraj @AJANEESHB pic.twitter.com/s9Rhrm8SgX
— Gurudev Hoysala (@Dhananjayaka) March 20, 2023