స్టార్ మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ “పుష్ప: ది రైజ్” మ్యూజిక్ తో అద్భుతమైన హిట్ సాధించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ “భవదీయుడు భగత్ సింగ్”కు బీట్స్ అందించడానికి సిద్ధం కాబోతున్నాడు దేవిశ్రీ. ‘పుష్ప’ హిట్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు ? అనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది టాలీవుడ్ లో. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం “భవదీయుడు భగత్ సింగ్” కోసం దేవి శ్రీ ప్రసాద్ 5 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని వినికిడి. ఇదే గనుక నిజమైతే ఇప్పటి వరకు ఆయన తీసుకున్న అత్యధిక రెమ్యూనరేషన్ ఇదే అవుతుంది.
Read Also : ‘బంగార్రాజు’ డైరెక్టర్ కు బిగ్ ఆఫర్
గతంలో దేవి శ్రీ ప్రసాద్, హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన “గబ్బర్ సింగ్” బ్లాక్ బస్టర్ అయింది. “భవదీయుడు భగత్ సింగ్” కోసం మరోసారి ఈ ముగ్గురూ కలిసి వస్తున్నారు. అందుకే దేవిశ్రీ రెమ్యునరేషన్ డిమాండ్‌కు తగ్గట్టుగా మేకర్స్ కూడా సిద్ధమయ్యారని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ త్వరలో “భవదీయుడు భగత్ సింగ్” ఆల్బమ్‌ను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ అతి త్వరలో సెట్స్ పైకి రానుంది. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు దేవిశ్రీ ఎలాంటి మ్యూజిక్ అందిస్తాడో చూడాలి. మెగా అభిమానులు మాత్రం దేవిశ్రీ మీద నమ్మకంతో ఆయన మ్యూజిక్ మ్యాజిక్ లో పడిపోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.