గత కొన్నాళ్లుగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల మీద ఉన్న అసహనాన్ని ఎట్టకేలకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ బయటపెట్టాడు. పుష్ప 2 సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ కి దగ్గరైన తర్వాత కూడా ఇంకా మ్యూజిక్ అవుట్ ఫుట్ రాకపోవడంతో మరికొంతమంది సంగీత దర్శకులను మైత్రి టీం రంగంలోకి దించింది. ఆ తర్వాత ఈరోజు చెన్నైలో జరిగిన ఈవెంట్ కి దేవిశ్రీప్రసాద్ హాజరయ్యాడు. ఈ నేపథ్యంలోనే లైవ్లో మాట్లాడుతూ దేవిశ్రీప్రసాద్ తన అసహనాన్ని వ్యక్తం చేయడం హార్ట్ టాపిక్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిని సంబోధిస్తూ రవి సార్, మళ్ళీ నేను ఏదో స్టేజ్ ఎక్కి నువ్వు ఎక్కువ సేపు మాట్లాడావు అని నన్ను అనవద్దు. మీరు నన్ను టైం కి పాటలు ఇవ్వలేదు. టైంకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు టైం కి ప్రోగ్రాం కి రాలేదు అంటారు.
Sivakarthikeyan: విజయ్, రజనీకాంత్ ల రికార్డు బ్రేక్ చేసిన అమరన్
మీకు నా మీద చాలా ప్రేమ ఉంది కానీ ప్రేమ ఉన్నప్పుడు కంప్లైంట్స్ కూడా ఉంటాయి మీకు నా మీద ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి, ఏంటో అర్థం కాదు. ఇప్పుడు కూడా నేను వచ్చి దాదాపు 20 -25 నిమిషాలు అవుతుంది. సార్ కెమెరాలో ఎంట్రీ ఇవ్వాలి కాసేపు ఆగండి అని నన్ను ఆపారు. నాకు అసలే సిగ్గు నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు మాత్రమే సిగ్గు లేకుండా ఉంటాను, స్టేజ్ కింద ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువ సిగ్గుపడేది నేనే నేను. లేదు రా బాబు నేను లోపలికి వెళ్తాను అంటే నన్ను లోపలికి పంపించలేదు. చివరికి కిస్సిక్ పాట విని లోపలికి పరిగెత్తుకొచ్చాను. మీరు వచ్చినోడిని ఏమన్నారు రాంగ్ టైమింగ్ సార్ లేట్ వచ్చారు అన్నారు. నేనేం చేయను సార్ ? వేరేగా కలిసి అడిగినప్పుడు కిక్ ఉండదు ఇలా అడిగేసేయాలి నేను ఎప్పుడూ అంతే ఓపెన్ అంటూ దేవిశ్రీప్రసాద్ మాట్లాడేయటం హాట్ టాపిక్ అవుతోంది. నిర్మాతలతో ఎంతైనా బేధాభిప్రాయాలు ఉండవచ్చు కానీ ఇలా ఒక లైవ్ ఈవెంట్ జరుగుతున్న సందర్భంగా అందరి ముందు మాట్లాడటం కాస్త ఇబ్బందికర అంశమే. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఎలా తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది.